Happy Days: శ్రావ్స్ గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూస్తే షాక్…?

Happy Days.. సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈయన తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాలలో హ్యాపీడేస్ కూడా ఒకటి. 2007లో విడుదలైన ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో కొత్త నటీనటులతో తెరకేక్కించి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమాలో వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్ సిద్ధార్థ, గాయత్రీ రావు, రాహుల్ (టైసన్) , సోనియా దీప్తి, కృష్ణుడు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వీరిద్దరి మధ్య చాలా అద్భుతంగా కథ సాగింది అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. వీరిలో కర్లీ హెయిర్ తో కనిపించిన శ్రావ్స్ అలియాస్ సోనియా దీప్తి కి యువత బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఈమె లుక్కుకి తోడు ఆమె స్వీట్ వాయిస్ కూడా కుర్రాళ్లకు బాగా నచ్చేసింది.. ఈ సినిమాతో సోనియా విపరీతమైన అభిమానులను కూడా దక్కించుకుంది.

Happy Days: Do you remember Shravs.. Shocking to see how it is now...?
Happy Days: Do you remember Shravs.. Shocking to see how it is now…?

వరుస సినిమాలలో అవకాశాలు..

అలాగే ఇదే సినిమాల్లో సోనియా తోపాటు నటించిన కృష్ణుడు కూడా బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ సినిమా తెచ్చి పెట్టిన క్రేజ్ తోనే కృష్ణుడు నటించిన వినాయకుడు సినిమాతో సోలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా కూడా హిట్గా నిలిచింది. ఆ తర్వాత కార్తీ ఆవారా , మహేష్ బాబు దూకుడు సినిమాల్లో కూడా స్పెషల్ రోల్స్ చేసింది సోనియా. ఇక శివాజీ తో కలిసి బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. అలా వరస అవకాశాలు అందుకుంటూ భారీ పాపులర్ అయిన ఈమె తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నటించింది.. ఈ ముద్దుగుమ్మ ఉన్నట్టుండి సినిమాలకు దూరమైంది.. చివరిగా 2016లో చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే అనే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు.

అందాలతో ఆకట్టుకుంటున్న శ్రావ్స్

దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత అనుష్క, నవీన్ పోలిశెట్టి నటించిన మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్లో చురుగ్గా పాల్గొన్న సోనియా దీప్తి ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా కనిపించలేదు. ఈరోజు ఆమె పుట్టిన రోజు . ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్లు ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక తాజాగా ఈ అమ్మడి ఫోటోలు చూసి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఈ రింగుల జుట్టు అమ్మాయి సోనియా మరొకసారి తన అందచందాలతో యువతను మెస్మరస్ చేసిందని చెప్పవచ్చు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు