Hardik Pandya – Natasha Divorce : ఇట్స్ అఫీషియల్… డివోర్స్ ప్రకటించిన నటాషా, హార్దిక్ పాండ్యా

Hardik Pandya – Natasha Divorce : హార్దిక్ పాండ్యా, నటాషా విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని హార్దిక్ భార్య నటాషా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నటాషా సోషల్ మీడియాలో హార్దిక్ తో డివోర్స్ విషయాన్ని ప్రకటిస్తూ సుదీర్ఘ పోస్టు రాసుకొచ్చింది.

హార్దిక్, నటాష పోస్ట్ సారాంశం

దాదాపు నాలుగు ఏళ్లుగా కలిసి ఉన్న తర్వాత హార్దిక్ తాను ఒక నిర్ణయానికి వచ్చి, విడిపోవాలని మ్యూచువల్ గా డిసైడ్ చేసుకున్నామని వెల్లడించింది. మేమిద్దరం కలిసి ఉంటూ మా బెస్ట్ ఇచ్చాం. ఇన్నాళ్లు కలిసి ఉండడానికి తామిద్దరం గట్టిగా ప్రయత్నించామని, చేయగలిగిందంతా చేశామని చెప్పుకొచ్చిన నటాషా విడిపోవడమే బెటర్ అని ఇద్దరం నమ్ముతున్నాము అంటూ రాసుకొచ్చింది. నిజానికి మా ఇద్దరికీ ఇదొక కఠినమైన నిర్ణయం అంటూనే ఇద్దరూ ఒకరి మీద ఒకరం రెస్పెక్ట్ తో విడిపోతున్నామని చెప్పుకొచ్చింది. ఒక ఫ్యామిలీ గా పెరగడాన్ని తామిద్దరం ఎంజాయ్ చేసామని, ఇప్పుడు హార్దిక్, తాను ఒకరిపై ఒకరం రెస్పెక్ట్ తో విడిపోతున్నామని క్లారిటీ ఇచ్చింది. అయితే తమ ఇద్దరికీ పుట్టిన బిడ్డ అగస్త్య ఇద్దరితో కలిసి ఉంటాడని, తనకోసం మేమిద్దరం కో పేరెంట్స్ గా ఉంటామని వివరించింది. తన హ్యాపీనెస్ కోసం భార్యభర్తలుగా విడిపోయినప్పటికి తామిమిద్దరం తల్లిదండ్రులుగా కలిసి ఉంటామని చెప్పుకొచ్చిన నటాషా అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుని తమకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేసింది. ఇలాంటి డిఫికల్ట్, సెన్సిటివ్ టైంలో ప్రైవసీని గౌరవించాలంటూ సిన్సియర్ గా అభిమానులను కోరింది. హార్దిక్ కూడా ఇదే పోస్ట్ ను షేర్ చేసి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Hardik Pandya And Natasa Stankovic Divorced, 70% Of Property To Be Transferred: Reports | cricket.one - OneCricket

- Advertisement -

మెట్టినిల్లు వదిలి పుట్టింటికి చేరిన నటాషా

చాలాకాలంగా ఈ జంట విడాకులు తీసుకోబోతోంది అంటూ వార్తలు రాగా, పలు సస్పెన్స్ ఫుల్ పోస్టుల తరువాత మంగళవారం నటాషా సెర్బియాలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ కూడా చేసింది. తర్వాత ఆమె ముంబై విమానాశ్రయంలో కనిపించింది. నటాషాతో పాటు కొడుకు అగస్త్య కూడా కనిపించాడు. చాలా కాలంగా వస్తున్న ఊహాగానాలపై హార్దిక్ ఎట్టకేలకు మౌనం వీడి విడాకులను ధృవీకరించాడు.

నటాషా ఒక సెర్బియన్ మోడల్. ఆమె 2012 లో భారతదేశానికి వచ్చి ప్రకాష్ ఝా సత్యాగ్రహ చిత్రంలో ఐటెం సాంగ్ ద్వారా బాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఆమె బిగ్ బాస్ 8, నాచ్ బలియే వంటి రియాలిటీ షోలలో కూడా భాగమైంది. ఇక టీమిండియా ఆల్ రౌండర్ ఆటగాడు హార్దిక్ పాండ్యా ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నటాషా, హార్దిక్ 2020 జనవరి 1న సన్నిహిత వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. కోవిడ్ టైమ్ లో అంటే 2020 మే 31న వివాహం చేసుకున్నారు. ఈ దంపతుల కుమారుడు అగస్త్య 2020 జూలై 30న జన్మించాడు. అంటే పెళ్ళికి ముందే ఈ జంట తల్లిదండ్రులు అయ్యారు. నటాషా, హార్దిక్ 2023 ఫిబ్రవరి 14న రెండవసారి గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్నారు. కానీ అంతలోనే విడిపోయి తమ అభిమానులకు షాక్ ఇచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు