Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ను వీడని నీడల పట్టుకున్న ఆ ప్రొడ్యూసర్

Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆ ప్రొడ్యూసర్ అస్సలు వదలటం లేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తు పవన్ ను వీడని నీడలా.. వెంటాడుతున్నాడు. ఆయన వైఖరి చూస్తుంటే తనతో మొదలు పెట్టిన సినిమాను ఖచ్చితంగా పూర్తి చేయవలసిందే అని పవన్ కళ్యాణ్‌ను నిలదీస్తున్నట్టే ఉంది. ఇంతకు ఎవరు ఆ ప్రొడ్యూసర్, ఏంటా సినిమా అనుకుంటున్నారా ఆ ప్రొడ్యూసర్ మరెవరు కాదు హరిహరవీరమల్లు సినిమా ప్రొడ్యూసర్ ఎం ఏం రత్నం

మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏం రత్నం నిర్మిస్తున్న సినిమా హరిహరవీరమల్లు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ డేట్స్ దొరికాయని హుటా హుటిన సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన మేకర్స్ అదే స్పీడ్ మళ్ళీ కంటిన్యూ చేయలేకపోతున్నారు.

పిరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న హరిహర వీరమల్లు సినిమా అప్పుడెప్పుడో ఆగిపోయిందంటే ఇప్పటివరకు మళ్ళీ ఈ షూటింగ్ జరుపుకోలేదు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ మీటింగ్స్ లో యాక్టివ్ గా పాల్గొనటం మూలాన ఈ సినిమా షూటింగ్ నానాటికి లెట్ అవుతూ వస్తుంది.

- Advertisement -

ఇదివరకే రెండు సార్లు ఈ సినిమా మొదలైనట్టే మొదలై ఆగిపోయింది. దాంతో ప్రొడ్యూసర్ ఏం రత్నం కు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రాజెక్ట్ ను ఎలాగైనా కంప్లిట్ చేస్తే తప్ప ఆయన ఆయన ఆ నష్టాన్ని భర్తీ చేసేలా లేడు. ఇక దాంతో చేసేదేమి లేక పవన్ ను చుట్టూ మరియు మెగా ఫ్యామిలీ కాంపౌండ్ చుట్టూ తిరుగుతున్నాడు.

ఇటీవలనే బ్రో సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కు హాజరైన ఏం రత్నం, లేటెస్ట్ గా భోళా శంకర్ ప్రి రిలీజ్ ఈవెంట్ లో కూడా కనిపించాడు. హరిహరవీరమల్లు సినిమా ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీడియాలో వార్తలు వస్తున్న క్రమంలో ఆయన ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోయే ఛాన్స్ లేదని తేలియాజేయటానికి ఈ విధంగా చేస్తున్నాడని తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే ఏం రత్నం  పవన్ కళ్యాణ్ తో సినిమాను ఎట్టి పరిస్థితుల్లో కంప్లిట్ చేసే దాకా ఆయన పవన్ కళ్యాణ్ వదలి పెట్టెల లేడు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు