Hari Hara VeeraMallu : మెడల్ని వంచి.. తొడకొట్టాడు ఓ తెలుగోడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రామ్ పాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ నెవెర్ బిఫోర్ పాత్రలో నటిస్తుండడంతో, అంచనాలు ఓ రేంజ్ లో క్రియేట్ అయ్యాయి.

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక ఇవాళ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా క్రేజీ అప్డేట్ ను వదిలింది చిత్ర బృందం. ఈ సినిమా నుంచి పవర్ గ్లాన్స్ పేరుతో ఇవాళ ఉదయం విడుదల చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు.

‘దిగొచ్చింది భల్లు భల్లున, పిడుగే దిగొచ్చింది భల్లు భల్లున, మెడల్ని మంచి కథల్ని మార్చి కొలిక్కి తెచ్చే పనేట్టుకొని తొడ కొట్టాడు, తెలుగోడు’ అంటూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో విడుదల చేసిన పవర్ గ్లాన్స్ పవర్ఫుల్ గా ఉంది. మీసం తిప్పి తొడగొట్టిన ఓ తెలుగోడుగా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. మల్లయోధులను పవన్ మట్టి కరిపించిన తీరు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. భారీ స్థాయిలో నిర్మించిన సెట్ లో వందలాది జనాల మధ్య పవన్ మల్ల యోధునిల మట్టి కరిపించే సీన్ టెర్రిఫిక్ గా ఉంది. ఈ ఒక్క సీన్ చాలు సినిమాని ఎంత గ్రాండియర్ గా మేకర్స్ తెరకెక్కిస్తున్నారో స్పష్టం చేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు