Pawan kalyan : ఎట్టకేలకు హరి హర వీరమల్లు నుంచి అప్డేట్

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలన్నిటిలో హరి హర వీరమల్లు సినిమా గురించి తప్ప.. మిగితా అన్ని సినిమాల షూటింగ్ కి సంబంధించి రోజు ఎదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది . ఈ సినిమా కంటే వెనక మొదలైన ఉస్తాద్ భగత్ సింగ్, OG సినిమాలు ఇప్పటికే రెండు, మూడు షెడ్యూల్స్ కంప్లిట్ చేసుకోగా..హరి హర వీరమల్లు సినిమా మాత్రం అప్పుడెప్పుడో ఆగిపోయి, ఇప్పటి వరకు మళ్ళీ షూటింగ్ మొదలవలేదు

తెలుగులో కమర్షియల్ డైరెక్టర్లు కాకుండా, మంచి కథ, కథనం తో ప్రేక్షకులకి సరి కొత్త అనుభూతినిచ్చే, అతికొద్ది మంది దర్శకులలో జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్ ) ఒకరు. గమ్యం సినిమాతో దర్శకుడిగా పరిచమైన క్రిష్ ఇండస్ట్రీలో మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన వైష్ణవ్ తేజ్ హీరోగా కొండపోలం అనే సినిమా చేసాడు. ఈ సినిమా తరువాత వెంటనే పవన్ కళ్యాణ్ డేట్స్ దొరకడంతో హరి హర వీరమల్లు సినిమా స్టార్ట్ చేసాడు. కొన్ని రోజులు షూటింగ్ గడిచాక కొండపోలం సినిమా విడుదలవ్వాల్సి ఉండటంతో మొదటిసారి హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది.

ఆ తరువాత పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు కమిట్ అయ్యాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లిట్ చేయాలనే ఉద్దేశ్యంతో పవన్ ఈ సినిమాకి డేట్స్ కేటాయించిన అనుకోని కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దాంతో పవన్ కళ్యాణ్ ఆయన కమిట్ అయిన మిగిత సినిమాలపై ఫోకస్ పెట్టాడు. బ్రో సినిమాకి తన పార్ట్ షూటింగ్ కూడా కంప్లిట్ చేసిన పవన్, ప్రస్తుతం OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే పవన్ వచ్చే ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని, పవన్ తన చేతిలో ఉన్న సినిమాలని కంప్లిట్ చేయాలనే ఉద్దేశ్యంతో హరి హర వీరమల్లు సినిమాకి కూడా డేట్స్ కేటాయించాడట. ఈ సినిమా షూటింగ్ వచ్చే జూన్ మొదటి వారం నుంచి మొదలవబోతుంది. దాదాపు 3 నెలల గ్యాప్ తరువాత ఈ సినిమా షూటింగ్ మొదలవుతుండటంతో ఫ్యాన్స్ లో మళ్ళీ జోష్ వచ్చింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు