Pawan kalyan : వీరమల్లు పెద్ద దెబ్బేసింది భయ్యా… రీషూట్‌తో నిర్మాతలకు మళ్లీ భారీ నష్టం..

Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ ‘ హరి హర వీరమల్లు ‘.. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అవుతుంది.. అప్పుడెప్పుడో సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇచ్చారు.. పవన్ కళ్యాణ్ లుక్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.. మొన్న విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పేదల కోసం పోరాడే ఒక యోధుడు పాత్రలో కనిపించబోతున్నారు.. కాగా, ఈ సినిమా షూటింగ్ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది..

అదేంటంటే.. ఈ సినిమాకు మొదట డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు.. అయితే కొన్ని కారణాల వల్ల నిర్మాతలు ఆయనను తప్పించి మరో డైరెక్టర్ ను రంగంలోకి దింపారు.. ప్రస్తుతం ఈ సినిమాకు జ్యోతి కృష్ణ అనే డైరెక్టర్ తో షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అనుకున్నట్లుగానే సినిమా షూటింగ్ ను కొత్త డైరెక్టర్ తో దాదాపు 60 శాతం వరకు పవన్ కళ్యాణ్ లేకుండా పూర్తి చేసినట్లు తెలుస్తుంది.. అయితే ఆ అవుట్ పుట్ పవన్ కళ్యాణ్ కు అస్సలు నచ్చలేదట.. అంతేకాదు మళ్ళీ షూటింగ్ చెయ్యాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది..

hariharaveeramallu shooting updates
hariharaveeramallu shooting updates

ఇప్పటికే ఒకసారి కొన్ని సీన్లను పూర్తి చేసిన వీరమల్లు టీమ్ ఇప్పుడు మరోసారి షూటింగ్ చెయ్యడం అంటే కష్టం అని భావించిందని తెలుస్తుంది.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీకి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.. పవన్ కళ్యాణ్ కు నచ్చని పార్ట్ ను కట్ చెయ్యకుండా మొత్తం షూటింగ్ ను త్వరగా పూర్తి చెయ్యాలనే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు తెలుస్తుంది. నిర్మాత ఏ. ఎం రత్నం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 20 న విడుదల కాబోతుందని ఓ వార్త షికారు చేస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు టాక్..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు