HariHaraVeraMallu : పవన్ రాక కోసం నిర్మాత ప్రయత్నాలు.. అందరికంటే గట్టిగా ట్రై చేస్తున్నాడు.. ఎందుకంటే?

HariHaraVeeraMallu : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దాదాపు నాలుగేళ్లకు పైగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ జరుపుకోవడానికే నానా తంటాలు పడుతుంది. దీని తర్వాత మొదలైన పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా ఎప్పుడో విడుదల అయిపోయాయి. కాని వీరమల్లు మాత్రం ఇంకా తెరకెక్కుతూనే ఉంది. దీనికి పవన్ రాజకీయాల్లో బిజీ అవడమే కారణం అని చెప్పొచ్చు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గా గెలవడం అంతకుమించి ఏకంగా డిప్యూటీ సీఎం కావడం వల్ల ఇప్పుడు మరింత బాధ్యత పవన్ పై పడింది. అందువల్ల ఈపాటికే మూవీ షూటింగ్ లలో అడుగుపెట్టాల్సిన పవన్ ఇంకా సమయం కేటాయించలేకపోతున్నాడు. కానీ ఎలాగైనా సరే హరిహరవీరమల్లు (HariHaraVeeraMallu) సినిమాను ఈ ఏడాది పూర్తి చేసి ఇయర్ ఎండ్ లో అయినా విడుదల చేయాలని చిత్ర నిర్మాత ఏఎం రత్నం గట్టిగా ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికోసం ఎన్నికల ముందు నుండి పవన్ తోనే నిర్మాత ప్రయాణం సాగిస్తున్న విషయం తెలిసిందే.

HariHaraVeraMallu producer AM Ratnam is trying for Pawan Kalyan's arrival on the sets

పట్టువదలని ఏఎం రత్నం..

ఇక హరిహరవీరమల్లు నుండి క్రిష్ తప్పుకున్నాక మరింత ఒత్తిడి నిర్మాతపై పడింది. ఇక దాని నుండి త్వరగానే కోలుకుని ఆ దర్శకత్వ బాధ్యతలని ఏఎం రత్నం తన కొడుకు డైరెక్టర్ జ్యోతి కృష్ణ కి అప్పగించాడు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి సంబంధించి ఆ మధ్య కొన్ని బాధ్యతలని పంచుకున్న నిర్మాత రత్నం, పవన్ ని మెల్లిగా షూటింగ్ కి రప్పించేందుకు ట్రై చేస్తున్నాడు రత్నం. అయితే పవన్ తో చేస్తున్న మిగతా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు, అలాగే దానయ్య కూడా కూడా పవన్ డేట్ల కోసం ట్రై చేస్తున్నప్పటికీ ఏఎం రత్నం అందరికంటే గట్టిగా ట్రై చేస్తున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే నాలుగేళ్లకు పైగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా. ఇప్పటికే రిలీజ్ డేట్ ఆలస్యమయింది.

- Advertisement -

షూటింగ్ ఎంతవరకొచ్చిందంటే…

ఇక హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చిందంటే దాదాపు 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది. పవన్ అటు ఎన్నికల షూటింగ్ లో బిజీ అయినా కొన్ని రోజులు పవన్ లేని ఇతర సన్నివేశాలు పూర్తి చేసారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ షూటింగ్ రావాల్సిన పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం వీరమల్లుకి సంబంధించి CGI వర్క్ జరుగుతుందిట. దీనికి సంబంధించి చార్మినార్ CGI వర్క్ హైదరాబాద్ లోనే చేస్తుండగా, టైగర్ సీక్వెన్స్ కి సంబంధించి CGI కెనడా వాళ్ళకి ఇచ్చారని, అలాగే రకరకాల పనులకి సంబంధించి ఒక్కొక్కరికి ఇచ్చి ముందు గ్రాఫిక్స్ కి సంబంధించిన పనులను పూర్తి చేస్తున్నారట. ఇక పవన్ రాక కోసమే నిర్మాత రత్నం వెయిట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. పవన్ ఈ సినిమాకి ఎంత లేదన్న 20 రోజులపాటు గట్టిగా కేటాయిస్తే షూటింగ్ తొందరగా పూర్తయ్యే ఛాన్స్ ఉందిట. మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఫ్రీ అయి సెట్స్ లో అడుగుపెడతాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు