Harikrishna – Kalyan Ram: తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు.. అసలు ఎక్కడ చెడింది..?

Harikrishna – Kalyan Ram.. నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన దివంగత నటులు హరికృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తండ్రితో పాటే రాజకీయాలలో కొనసాగిన ఈయన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. రాజకీయాల్లో ముక్కుసూటిగా వ్యవహరించిన హరికృష్ణ సినిమాలలో గంభీరమైన పాత్రలు చేసి ఆకట్టుకున్నారు. మరొకవైపు ఈయన వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన కళ్యాణ్ రామ్ కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే ఇద్దరి మధ్య గొడవలు వచ్చినట్లు సమాచారం.మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

Harikrishna - Kalyan Ram: Differences between father and son.. Where did it go wrong..?
Harikrishna – Kalyan Ram: Differences between father and son.. Where did it go wrong..?

దానికోసం నాన్న వెంటపడే వాడిని..

లాహిరి లాహిరి సినిమా సమయంలో హరికృష్ణ కి, కళ్యాణ్ రామ్ కి మధ్య గొడవ జరిగిందట. ఈ విషయాన్ని కళ్యాణ్ రామ్ స్వయంగా చెప్పుకొచ్చారు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. నేను కోయంబత్తూర్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఖాళీగా ఉన్న సమయంలో వైవిఎస్ చౌదరి ఒకసారి నా వద్దకు వచ్చి, ఒక కథ ఉంది వింటారా బాబు అని అడిగారు.. ఓకే వింటాను అని చెబితే , ఆయన లాహిరి లాహిరి లాహిరిలో సినిమా కథ చెప్పారు. అయితే ఇది నాన్న కోసం రాశాను మీరే ఆయనను ఒప్పించాలి అని నాతో చెప్పారు. అప్పటినుంచి నేను నాన్న వెంట పడడం మొదలుపెట్టాను. నాన్నకు ఆ సమయంలో సినిమాలు చేసే ఆలోచన లేదు.. మరోవైపు కథపై అనుమానాలు కూడా ఉండేవి.. అయితే మా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన వైవిఎస్ చౌదరి చెప్పడంతో ఎలాగైనా సరే ఒప్పించే ప్రయత్నం చేశాను. మరొకవైపు వైవిఎస్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తానని చెబుతున్నారు ఆయన ఇంత డబ్బు పెట్టుకోగలరా అని అనుమానం కూడా నాన్నలో ఉండేది. అయితే నేను నాన్నని వదల్లేదు మీరు సినిమా చేయాల్సిందే అని పట్టు పట్టాను.

ఆ సినిమా వల్లే నాన్నకు నాకు మాటలు లేవు..

అయినా నాన్న ఒప్పుకోలేదు. దీంతో ఒకరోజు వైవిఎస్ చౌదరి మీద మీకు అనుమానం ఉంది కదా.. సరే ఈ చిత్రాన్ని నేనే నిర్మిస్తానని చెప్పాను. అయితే నాన్న ఒక్కసారిగా భయపడి ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నాడు.. ఎక్కడ అనవసరంగా ఇరుక్కుపోతాడో అని నాన్న భయపడ్డారు. ఆ తర్వాత ఈ విషయంపై కొద్ది రోజులు నాన్న నేను మాట్లాడుకోలేదు. ఒకరోజు నాన్నే వచ్చి ఓకే నేను సినిమా చేస్తాను. కానీ ఒక కండిషన్ నువ్వు ఇండియాలో ఉండకూడదు. యూఎస్ వెళ్లి చదువు పూర్తి చెయ్యి నేను సినిమా చేస్తా అన్నారు. ఇక అలాగే నాన్న చెప్పినట్టు నేను యూఎస్ వెళ్లి ఎంఎస్ పూర్తి చేసి కొద్దిరోజుల జాబ్ చేసి.. నేను చదువుకోవాలి అనుకునే నాన్న కోరికను తీర్చాను. ఈ సినిమా కారణంగానే నాన్నకు నాకు మధ్యలో కొన్ని రోజులు మాటల్లేకుండా పోయాయి అంటూ చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు