Happy Birthday: “THE” Vijay Devarakonda.. హరీష్ శంకర్.. రచ్చ మామూలుగా లేదుగా

గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తుంది. అయితే ఈ సినిమా నుంచి ఇటీవల పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. అందులో THE విజయ్ దేవరకండ అని ఉంది. సాధారంగా, ఇండస్ట్రీలో పెద్ద హీరోలు కూడా THE అనే పదాన్ని వాడలేదు. కానీ, ఈ రౌడీ హీరో తన పేరు ముందు THE పదాన్ని వాడటంతో కొంత వరకు విమర్శలు వచ్చాయి.

అయితే ఈ విషయంలో తన వ్యాఖ్యలతో ఎప్పుడూ వివాదాల్లో ఉండే అనసూయ జోక్యం చేసుకుంది. THE పదం వాడటంపై కొన్ని విమర్శలు చేసింది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా అనసూయను ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. అది చిలికి చిలికి గాలి వానలా మారిపోయింది. ఇంత జరుగుతున్నా.. విజయ్ దేవరకొండ మాత్రం స్పందించకుండా, తర్వాత వచ్చిన ఓ సాంగ్ పోస్టర్ లో కూడా THE విజయ్ దేవరకొండ అనే పేరుతోనే కనిపించాడు. ఇదిలా ఉండగా, ఈ రౌడీ హీరో ఈ రోజు పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.

అందులో భాగంగా డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశాడు. అందులో Happy Birthday THE Vijay Devarakonda అని ఉంది. పోస్టర్ మొత్తంలో THE హైలైట్ గా కనిపిస్తుంది. అంతే కాదు.. విజయ్ దేవరకొండ గురించి వివరిస్తూ.. ప్రతి పదానికి THE ని చేర్చాడు. దీంతో ఈ రౌడీ హీరోకు విష్ చేసే వాళ్లు అందరూ THE Vijay Devarakonda అంటూనే పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. హరీష్ శంకర్ పోస్ట్ తో ఒక్కసారిగా THE అనేది బ్రాండ్ గా మారిపోయింది. ఈ బ్రాండ్ విజయ్ దేవరకొండది అయిపోయింది.

- Advertisement -

ఇదిలా ఉండగా, ఈ పోస్ట్ ను యాంకర్ అనసూయకు కౌంటర్ ఇచ్చేలా డైరెక్టర్ హరీష్ శంకర్ పోస్ట్ చేశాడని రౌడీ హీరో ఫ్యాన్స్ అంటున్నారు. నిజమే మరి… THE గురించి విజయ్ ని నిలదీస్తే సపోర్ట్ వస్తుంది అనుకున్న అనసూయకు ఇది ఒక పెద్ద మైనసే అనుకోవాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

https://twitter.com/harish2you/status/1655569405353381890?s=20

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు