Harish Shankar : మీకు మెమొరబుల్ టీజర్ ఇస్తా

Harish Shankar : ప్రతి దర్శకుడికి కూడా వాళ్లకు ఇష్టమైన హీరో ఒకరు ఉంటారు. ఇకపోతే చాలామంది దర్శకులకు ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి. అలానే చాలామంది నటులకు దర్శకులకు ఇష్టమైన హీరో అమితాబ్ బచ్చన్. అమితాబచ్చన్ కి వీరాభిమానులు ఉన్నారు. చాలామంది ప్రేక్షకులు అభిమానులు అవ్వడం మామూలు విషయం. కానీ కొన్ని సందర్భాల్లో అభిమాన ప్రేక్షకులే దర్శకులు అవుతుంటారు. ఆ దర్శకులు తమ అభిమాన హీరోలతో కూడా సినిమాలు చేస్తూ ఉంటారు. అవి సక్సెస్ సాధిస్తే అంతకు మించిన సంతోషకరమైన విషయం ఇంకొకటి ఉండదు. ఇక హరీష్ శంకర్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద వీరాభిమాని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమాను తీయగలిగాడు.

ఇక అలానే హరీష్ కి పవన్ కళ్యాణ్ తో పాటు అమితాబచ్చన్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా హరీష్ శంకర్ నాన్న అమితాబచ్చన్ కి వీరాభిమాని, ఆ అభిమానాన్ని అమితాబ్ బచ్చన్ వరకు తీసుకెళ్లి ఆయనతో ఫోటో దిగేలా చేశాడు హరీష్. ఇకపోతే హరీష్ ఈరోజు ఇండస్ట్రీలు ఈ స్థాయిలో ఉండడానికి కారణం రవితేజ అని చెబుతూ ఉంటారు. ఇది చాలా మందికి తెలిసిన విషయమే, మొదటి సినిమా ఫెయిల్ అయినా కూడా రెండవసారి అవకాశం ఇచ్చి సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హరీష్ ను నిలబెట్టిన ఘనత రవితేజకు దక్కుతుంది.

Harish Shankar

- Advertisement -

ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో 3వ సినిమా వస్తుంది. ఆ సినిమా పేరు మిస్టర్ బచ్చన్. ఇక రవితేజ అమితాబ్ బచ్చన్ కు ఎంత పెద్ద ఫ్యాన్ అని అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని చాలా సినిమాల్లో కూడా కొంతమంది దర్శకులు చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కంప్లీట్ అదే టైటిల్ పెట్టి సినిమా చేస్తున్నాడు హరీష్. ఇకపోతే ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మ్యూజిక్ కి ఇదివరకే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా రెడీ అయిపోయినట్లు అప్డేట్ ఇచ్చాడు హరీష్ శంకర్. ఈ టీజర్ తో ఎన్నో జ్ఞాపకాలు అనుభవాలను గుర్తు చేసి మీకు మోస్ట్ మెమొరబుల్ టీజర్ ఇస్తానంటూ ప్రామిస్ చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు