Harish Shankar : ఆయనో లెజెండ్.. ఆయనను అనుకరించలేం… Filmify ఆర్టికల్ పై హరీష్ శంకర్ రియాక్షన్

Harish Shankar : ప్రస్తుత కాలంలో ఏదైనా ఒక విషయం చెప్పాలి అని అనుకుంటే ఆ విషయాన్ని ఆ సెలబ్రిటీతో డైరెక్ట్ గా చెప్పే అవకాశం సోషల్ మీడియా వలన కలిగింది. అయితే కొన్నిసార్లు మనం అనుకున్న సెలబ్రెటీ కి ఆ విషయం రీచ్ కాకపోవచ్చు కానీ ఇంకొన్నిసార్లు మాత్రం ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో దర్శకుడు హరీష్ శంకర్ ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దీని కారణం కూడా హరిశంకర్ దర్శకుడు కాకముందు ఒక సాధారణ ఆడియన్. పవన్ కళ్యాణ్ సినిమాను చొక్కాలు చింపుకొని ఎంజాయ్ చేసే ఒక అభిమాని. కట్టి కాలే వరకు కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకునే వీరాభిమాని. ఒక పవన్ కళ్యాణ్ అభిమాని దర్శకుడు అయితే ఎలా ఉంటుందో అనే దానికి నిదర్శనం హరీష్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ సినిమా.

ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో అని అందరి అభిమానులు తరపున ఇండస్ట్రీకి తెలియజేశాడు హరీష్. ఆడియో ఫంక్షన్ లో చెప్పినట్లు ఆకలితో ఉన్న ప్రేక్షకులను భూక్తయాసంతో బయటకు పంపించాడు. హరీష్ తన జీవితంలో దర్శకుడు కావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిన తర్వాత కూడా టెక్నీషియన్స్ లిస్టులో తన పేరు లేకపోతే అన్నపూర్ణ స్టూడియో నుంచి పంజాగుట్ట వైపు ఏడ్చుకుంటూ నడిచి వచ్చిన హరీష్ జీవితంలో కనబడని కష్టాలు ఎన్నో ఉన్నాయి.

మోడ్రన్ రాఘవేంద్రరావు

 

- Advertisement -

ఇకపోతే సినిమా ద్వారా సమాజాన్ని మార్చేద్దాం విజ్ఞానపరిచేద్దాం అని కాకుండా మంచి వినోదాన్ని పంచుదాం అని ఫిక్స్ అయ్యే దర్శకుడు హరీష్ శంకర్. లేకపోతే ప్రస్తుతం హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి మొదటి పాట రిలీజ్ అయినప్పుడు చాలామంది ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వాటన్నిటికీ ధీటుగా సమాధానం ఇచ్చాడు హరీష్. ఇక రీసెంట్ గా సితార్ పాట గురించి ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే ఫిల్మీపై వెబ్సైట్ హరీష్ శంకర్ ఇప్పటివరకు చేసిన పాటలను మెన్షన్ చేస్తూ హరీష్ శంకర్ ను మోడ్రన్ రాఘవేంద్రరావు అంటూ పరిగణిస్తూ ఒక ఆర్టికల్ ను ప్రచురించింది.

K. Raghavendra Rao

ఆర్టికల్ పై హరీష్ శంకర్ స్పందన

అయితే ఇదే ప్రశ్నను ఒక ప్రముఖ జర్నలిస్ట్ మిస్టర్ బచ్చన్ టీజర్ లాంచ్ ఈవెంట్లో మిమ్మల్ని మోడ్రన్ రాఘవేంద్రరావు అంటూ అంటున్నారు ఆయన మీద మీ ఇన్ఫ్లుయెన్స్ ఎంతుంది.? దీని గురించి ఏం చెప్తారు అని అడిగినప్పుడు. హరీష్ సమాధానం ఇస్తూ అంత గొప్ప వ్యక్తితో పోల్చడం అదృష్టం. నిజంగా ఆయనను మనం అనుకరించలేము అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇదే ప్రశ్నను హరీష్ అదే జర్నలిస్ట్ తో మూడుసార్లు అడిగించారు. మొదటిసారి మీ ప్రశ్న వినిపించింది కానీ మీరు అలా పొగుడుతుంటే చాలా ఆనందం వేసింది అందుకనే మళ్ళీ అడిగించాను అంటూ హరీష్ సమాధానం ఇచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు