Mr Bacchan : భాగ్యశ్రీ సక్సెస్ వెనుక నేనే ఉన్నాను – హరీష్ శంకర్

Mr Bacchan : టాలీవుడ్ లో ఈ మధ్య పెద్ద సినిమాల హడావిడి తగ్గిపోగా, వచ్చే వారం కూడా చిన్న సినిమాల సందడే నెలకొని ఉంది. అయితే ఆగష్టు 15 నుండి మళ్ళీ పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. ఇక వాటిలో రవితేజ – హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ కూడా ఒకటి. ఈ సినిమాపై రవితేజ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ లోనూ భారీ అంచనాలున్నాయి. రవితేజ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఇండస్ట్రీలో క్రేజీ హైప్ ఉంది. ఇక తన ప్రతి సినిమాలోనూ హీరోలను డిఫరెంట్ గా చూపిస్తూ, హీరోయిజాన్ని ఎలివేట్ చేసే దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. ఇప్పుడు రాబోతున్న మిస్టర్ బచ్చన్ తోనూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతుండగా, ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్స్ తో హైప్ భారీగా పెంచేయగా, పలు ఈవెంట్స్, ఇంటర్వ్యూలు ఇస్తూ మిస్టర్ బచ్చన్ పై మరింత బజ్ వచ్చేందుకు ట్రై చేస్తున్నారు.

Harish Shankar Interesting Comments on Bhagyashree Borse

భాగ్యశ్రీ వెనకాల నేనే ఉన్నా – హరీష్ శంకర్

ఇక మిస్టర్ బచ్చన్ (Mr Bacchan) సినిమా ప్రమోషన్లు ఆసక్తికరంగా చిత్ర యూనిట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మిస్టర్ బచ్చన్ చిత్ర యూనిట్ తాజాగా సెట్స్ లో ఫ్రెండ్షిప్ డే రోజును సెలబ్రేట్ చేసుకున్న వీడియోను రిలీజ్ చేయగా, అందులో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ట్రెండ్ అవుతుంది. అక్కడ సరదాగా నడుస్తున్న ఓ డిబేట్ లో స్క్రీన్ పై షూటింగ్ స్టిల్స్ ప్లే చేసారు. అందులో హీరోయిన్ భాగ్యశ్రీ వెనుక ఉన్న హరీష్ శంకర్ ను చూపించి దీనిపై మీ అభిప్రాయం ఏంటి.. అని రచయిత బివిఎస్ రవి భాగ్యశ్రీ ని అడిగాడు. అయితే వెంటనే మైక్ తీసుకుని హరీష్ శంకర్ దానికి రిప్లై ఇచ్చాడు.

- Advertisement -

అమ్మాయి విజయం వెనక ఒక మగాడు ఉన్నట్టు…

ఇక దర్శకుడు హరీష్ శంకర్ ఆ ఫోటోకి స్వయంగా రెస్పాండ్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ… ప్రతి అమ్మాయి వెనుక కూడా ఒక మగాడు ఉంటాడు అని ప్రూవ్ చేస్తుంది ఈ ఫోటో. అలాగే భాగ్యశ్రీ సక్సెస్ వెనుక నేనున్నాను అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. ఇక హరీష్ శంకర్ అన్న ఈ మాటలు వైరల్ గా మారాయి. ఇక మిస్టర్ బచ్చన్ కి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించగా, ఇప్పటికే పాటలన్ని హిట్ అయ్యాయి. ఇక ట్రైలర్ లాంచ్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడమే మిగిలుంది. ఇక మిస్టర్ బచ్చన్ సినిమా ఆగష్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు