Mister Bacchan : బచ్చన్ పాటలన్నీ అక్కడే తీసారట… హరీష్ ప్లానింగ్ బానే ఉంది..

Mister Bacchan : మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న తాజా సినిమా “మిస్టర్ బచ్చన్”. నామ్ తో సునా హోగా (పేరు వినే ఉంటారు)… అనేది ఉప శీర్షిక. ఈ చిత్రానికి టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక హరీష్ శంకర్ ని పరిచయం చేసింది కూడా రవితేజనే అని తెలిసిందే. రవితేజ నటించిన ‘షాక్’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన హరీష్ శంకర్ ఆ వెంటనే రవితేజ తోనే ‘మిరపకాయ్’ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక తర్వాత చాలా ఏళ్ళకు వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్ చిరం “మిస్టర్ బచ్చన్”. ఇక ఈ కాంబో సెట్ అవగానే సినిమాపై అంచనాలు పెరిగిపోగా, రీసెంట్ గా డైలాగ్స్ లేకుండా రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి షో రీల్ పేరిట టీజర్ రిలీజ్ చేయగా, ఆ వీడియో చూస్తే… మాస్ మహారాజా రవితేజ రాంపేజ్ ఫుల్లుగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే హరీష్ శంకర్ అంటే మాస్ పంచ్ డైలాగులకు పెట్టింది పేరు. కానీ ‘మిస్టర్ బచ్చన్’ (Mister Bacchan) షో రీల్ లో ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లేదు. వీడియో అంతా మాస్ మహారాజా మాస్ యాక్షన్ చూపించారు. అందులోనూ హరీష్ శంకర్ మార్క్ కనిపించింది.

Harish Shankar Interesting Update on Mister Bacchan Songs

బచ్చన్ సాంగ్స్ అన్నే అక్కడే షూట్ చేశారట…

ఇక మిస్టర్ బచ్చన్ సినిమా గురించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. అది ఈ సినిమా సాంగ్స్ గురించి కావడం విశేషం. తాజాగా ఈ చిత్రం సాంగ్స్ షూటింగ్ కి సంబందించిన అప్డేట్ ను డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సినిమాలో దాదాపు అన్ని పాటలు “దాల్ లేక్” వద్ద చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. దాల్ లేక్ అంటే కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో అందమైన ఊరు. అక్కడ హీరోయిన్ తో డ్యూయెట్ సాంగ్స్ మూడు పాటలనూ అక్కడే షూట్ చేశారట. ఇక సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉండగా అది హైదరాబాద్ లోనే షూట్ చేసేసారు. అయితే రవితేజ మార్క్ ఇంట్రో సాంగ్ ఉంటుందా లేదా అని చూడాలి. ఇక ఈసారి మిస్టర్ బచ్చన్ కి సంబంధించి హరీష్ శంకర్ ఒక్క పాట కూడా విదేశాల్లో షూట్ చేయలేదు. మామూలుగా హరీష్ సినిమాల్లో ఒక ఫారిన్ సాంగ్ ఉండడం కామనే. కానీ ఇందులో మాత్రం లేదట. ఇక ఇదంతా హరీష్ ప్లానింగ్ అని, బడ్జెట్ ని కంట్రోల్ లో ఉంచడానికి కూడా ఇదొక ప్లాన్ అని సమాచారం. పైగా కాశ్మీర్ లో షూట్ చేయడం కూడా మంచి నేచర్ ఫీలింగ్ వస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోగా ఫస్ట్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.

- Advertisement -

పక్కా హరీష్ మార్క్ సినిమా దిగుతుంది.?

ఇక మిస్టర్ బచ్చన్ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కి బీజీఎమ్ అద్భుతంగా ఇచ్చాడని చెప్పాలి. ఇక ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాన్ని పనోరమా స్టూడియోస్ & టీ సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ ఎత్తున ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇక ‘మిస్టర్ బచ్చన్’ షో రీల్ చూస్తే… జగపతిబాబు రాజకీయ నాయకుడి క్యారెక్టర్ చేశారని అర్థం అవుతోంది. ఆయనకు, రవితేజకు మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్ అయితే థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ ని పరిచయం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు