Harish Shankar: ట్యూన్స్ ఇవ్వడం గొప్ప కాదు, అనుకున్న టైమ్ కి ఇవ్వడం గొప్ప

Harish Shankar: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. అన్నిసార్లు వాళ్ళు టాప్ మ్యూజిక్ ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు ఊహించిన దాని కంటే కూడా బెస్ట్ ఇవ్వచ్చు. ఏదేమైనా కూడా సినిమాకి కరెక్ట్ టైం కి మ్యూజిక్ ఇవ్వడమనేది మోస్ట్ ఇంపార్టెంట్. మ్యూజిక్ డైరెక్టర్ కి దర్శకుడికి మధ్య గతంలో ఎన్నో వివాదాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక సందీప్ రెడ్డి వంగ తీసిన అర్జున్ రెడ్డి సినిమా విషయానికి వస్తే, ఆ మ్యూజిక్ డైరెక్టర్ తనను ఎంత ఇబ్బంది పెట్టాడో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగ. ఆ తర్వాత మరో డైరెక్టర్ కూడా రధన్ వలన ఎంత ఇబ్బంది పడ్డాడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

కొన్ని సినిమాలకు సంబంధించి ఆన్ టైం కి మ్యూజిక్ ఇవ్వని డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ల పైన అనేక కథనాలు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇక రీసెంట్ గా అనిరుద్ రవిచంద్రన్ పై కూడా అటువంటి వార్తలు వచ్చాయి. దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న కూడా ఆ సినిమాకు సంబంధించి అనిరుద్ పాటలు రెడీ చేయలేదంటూ చాలా వార్తలు వచ్చాయి. ఇక రీసెంట్ టైమ్స్ లో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అంటే మిస్టర్ బచ్చన్ అని చెప్పాలి. మిక్కి జే మేయర్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు నాలుగు పాటలు రిలీజ్ అయ్యాయి ప్రతి పాట కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ పాటలన్నిటికి కేవలం ఒక వారం రోజుల్లో ట్యూన్స్ ఇచ్చేసాడంట. ఈ విషయాన్ని స్వయంగా హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.

Mickey J Meyer

- Advertisement -

మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దానికంటే ముందు రోజు నైట్ నుంచి పెయిడ్ ప్రీమియర్స్ ఈ సినిమాకి పడనున్నాయి. రైడ్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఒరిజినల్ కంటెంట్ కంటే కూడా ఈ సినిమా డిఫరెంట్ గా ఉంటుంది అని తెలుస్తుంది. ఒక రీమేక్ సినిమాకు ఒరిజినల్ ఫీల్ తీసుకువచ్చేలాగా ఎలా డీల్ చేయాలో హరీష్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో అలా చేసి హరీష్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ కి కూడా అదే రిపీట్ అవుతుందని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు