Harish Shankar: మెగా డబుల్ డ్యూటీ

Harish Shankar: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో హరీష్ శంకర్ ఒకరు. ముందుగా రచయితగా కెరియర్ మొదలుపెట్టి రవితేజ హీరోగా షాక్ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ పూరి జగన్నాథ్ దగ్గర రచయితగా పనిచేశాడు. ఆ తర్వాత మళ్లీ రవితేజ హీరోగా మిరపకాయ్ అనే సినిమాను తెరకెక్కించి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా నిలబడ్డాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే సినిమాను తరికెక్కించి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. దాదాపు 10 ఏళ్లపాటు పవన్ కెరియర్లో ఊహించదగ్గ హిట్టు లేదనుకునే టైంలో హరీశంకర్ దబాంగ్ అనే సినిమాని రీమేక్ చేసి గబ్బర్ సింగ్ రూపంలో పవన్ కళ్యాణ్ కు బ్లాక్ బస్టర్ అందించాడు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులంతా హరీష్ శంకర్ ని అభిమానించడం మొదలుపెట్టారు. ఇకపోతే వీరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది అని అంటే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి అని చెప్పొచ్చు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను కూడా అనౌన్స్ చేసి మొదలుపెట్టారు. ప్రస్తుతం రాజకీయ పనుల్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండిపోవడం వలన ఆ సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది.

 Pawan & Harish Shankar Film

- Advertisement -

ఇకపోతే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఆ సినిమాను మళ్ళీ మొదలు పెట్టమన్నారు. ప్రస్తుతం రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నాడు హరీష్ శంకర్ ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయిపోయింది. ఈ సినిమాకు సంబంధించిన పాటలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాని పీపుల్ మీడియా సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాతో పాటు అటువైపు పవన్ కళ్యాణ్ సినిమాను కూడా హరీష్ శంకర్ పూర్తి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కొన్నేళ్లపాటు కొంచెం గ్యాప్ తీసుకున్న హరీష్ కి ఒకేసారి రెండు బిగ్ ప్రాజెక్టులు చేతిలో పడటం అంటే మామూలు విషయం కాదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు