HarishShankar : ఆ కాంబోపై సాలిడ్ కథ ఉందట…సెట్టయితే రికార్డ్ బ్రేకింగే!

HarishShankar : టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఫుల్ జోరు మీదున్నాడు. మరో రెండు వారాల్లో తాను డైరెక్ట్ చేసిన సినిమా మిస్టర్ బచ్చన్ రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే హీరో,హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆగష్టు 15న విడుదల అవుతున్న నేపథ్యంలో రీసెంట్ గా టీజర్ ని కూడా రిలీజ్ చేయగా, హరీష్ శంకర్ చిత్ర యూనిట్ తో సహా వరుసగా ఆ సినిమా కోసం ప్రమోషన్లు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక రీసెంట్ గా పెట్టిన ప్రెస్ మీట్ లో హరీష్ శంకర్ తనదైన శైలిలో సెటైర్లతో ఫిల్మ్ ఇండస్ట్రీలో తన సినిమాపై అటెన్షన్ వచ్చేలా చేసాడు. ఇదిలా ఉండగా హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ తర్వాత పవన్ ఇచ్చే డేట్లని బట్టి ఉస్తాద్ భగత్ సింగ్ ని తొందర్లోనే ఫినిష్ చేస్తాడని సమాచారం. అయితే లేటెస్ట్ గా ప్రమోషన్ లో హరీష్ శంకర్ ఒక క్రేజీ న్యూస్ గురించి చెప్పుకొచ్చాడు.

Harish Shankar prepared the story for Mega Family multi starrer

ఈ కాంబోపై సాలిడ్ కథ సిద్ధం చేసిన హరీష్..

ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న హరీష్ శంకర్ లేటెస్ట్ గా ప్రమోషన్ లో తన దగ్గర ఒక క్రేజీ స్టోరీ ఉందని, టాలీవుడ్ ని ఏలుతున్న స్టార్ ఫ్యామిలీ కోసం రెడీగా ఉందని చెప్తున్నాడు. ఆ ఫ్యామిలీ ఏదో ఈ పాటికే అర్ధమై పోయి ఉండాలి.. అవును హరీష్ శంకర్ చెప్పింది మెగా ఫ్యామిలీ గురించే. టాలీవుడ్ ని శాసిస్తున్న మెగా ఫ్యామిలీ స్టార్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోసం హరీష్ శంకర్ ఒక సాలిడ్ ఫ్యామిలీ స్టారర్ స్టోరీ రెడీ చేసుకున్నాడట. ఈ వార్త సోషల్ మీడియాలో వచ్చినప్పటినుండి నెట్టింట ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

- Advertisement -

సెట్టయితే రికార్డు బద్దలు గ్యారెంటీ!

ఇక టాలీవుడ్ లో మెగా మల్టి స్టారర్ రావాలని, చిరు, పవన్, చరణ్ లను ఒకే సినిమాలో చూడాలని అభిమానులతో పాటు, మూవీ లవర్స్ ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్నారు. పదిహేనేళ్లుగా పలువురు స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ఈ కాంబో సెట్ చేయాలనీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ నుండి ఈ మాట వచ్చేసరికి మెగాభిమానులు సంబరపడిపోతున్నారు. ఈ కాంబో సెట్ కావాలని మెగాభిమానులు చాలా కోరుకుంటున్నారు. ఇక హరీష్ శంకర్ ఎంతటి డై హార్డ్ మెగాభిమానో తెలిసిందే. ఫ్యాన్స్ కూడా హరీష్ శంకర్ అంతటి సమర్థుడే అంటూ కితాబిస్తున్నారు. ఇక ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ ను పవన్ తో చేస్తున్న హరీష్ శంకర్, ఆ సినిమా పూర్తయ్యేలోగా పవన్ ని ఒప్పించి చిరు, చరణ్ లని కలిపి సినిమా మొదలెడితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు