Harish Shankar: రూమర్స్ పై స్పందించిన హరీష్ శంకర్

Harish Shankar: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో హరీష్ శంకర్ ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత రచయితగా నటుడుగా కూడా కొంత పేరని సంపాదించుకున్నాడు హరీష్ శంకర్. రవితేజ హీరోగా షాక్ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఊహించని స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత మళ్లీ రచయితగా పూరి జగన్నాథ్ దగ్గర పని చేశాడు. మళ్లీ రవితేజ అవకాశం ఇవ్వడంతో మిరపకాయ్ అనే సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

మిరపకాయ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశాన్ని పొందుకున్నాడు హరీష్. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేసిన గబ్బర్ సింగ్ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ గా సంచలనం సృష్టించింది. పవన్ కళ్యాణ్ కి పదేళ్లుగా హిట్ సినిమా లేదు అని అనుకున్న తరుణంలో గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఒక సగటు అభిమాని పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలి అనుకుంటాడో అలా చూపించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక ట్రీట్ ఇచ్చాడు.

Ustaad Bhagat Singh

- Advertisement -

గబ్బర్ సింగ్ సినిమా తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో సినిమా కోసం చాలామంది వెయిట్ చేశారు. వీరిద్దరూ కలిసి భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాను చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. కానీ తర్వాత తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన తెలుగు సినిమాను ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా బయటకు వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఒక అభిమాని ఈ సినిమా ఆగిపోయింది అని వార్తలు వస్తున్నాయి దీనిపైన మీరు స్పందించాలి అని హరీష్ శంకర్ ని ట్యాగ్ చేసినప్పుడు. హరీష్ ఆ రూమర్స్ గురించి క్లారిటీ ఇచ్చాడు. సినిమా స్టార్ట్ అవ్వదు అన్నప్పుడే పట్టించుకోలేదు. వీటిని పెద్దగా పట్టించుకోను, రూమర్స్ ను పట్టించుకునే అంత టైం లేదు అంటూ హరిష్ స్పందించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు