Mr Bacchan : నా మాస్ మహారాజ్ ని ఎలా చూపించాలో అంతకు 100 టైమ్స్ బెస్ట్ గా చూపించా – హరీష్ శంకర్

Mr Bacchan : టాలీవుడ్ లో ఈ పంద్రాగస్టుకి అరడజను క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతుండగా, అందులో భారీ అంచనాలు ‘మిస్టర్ బచ్చన్’ పైనే ఉన్నాయి. దానికి కారణం రవితేజ – హరీష్ శంకర్ కాంబోనే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కాంబో కోసం రవితేజ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూడగా ఇప్పుడు సెట్టయింది. రవితేజ – హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఇండస్ట్రీలోనూ క్రేజీ హైప్ ఉంది. ఇక తన ప్రతి సినిమాలోనూ హీరోలను డిఫరెంట్ గా చూపిస్తూ, హీరోయిజాన్ని ఎలివేట్ చేసే దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. ఇప్పుడు రాబోతున్న మిస్టర్ బచ్చన్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతుండగా, ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్స్ తో భారీగా హైప్ పెంచేయగా, హరీష్ శంకర్ సహా చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ, మిస్టర్ బచ్చన్ పై మరింత బజ్ వచ్చేందుకు ట్రై చేస్తున్నారు.

Harish Shankar talks about RaviTeja character in Mr Bacchan

గ్యాప్ కి కారణం ఇదే!

హరీష్ శంకర్ ఫ్రెండ్షిప్ డే సందర్బంగా సెట్స్ లో ఏర్పాటు చేసిన ఈవెంట్స్ లో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చాడు. ‘వీడే’ చిత్రం అప్పటి నుండి రవితేజ గారితో తన జర్నీ స్టార్ట్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా తర్వాత తర్వాత నా ఆటోగ్రాఫ్, నేనింతే, షాక్, మిరపకాయ్.. ఇలా చాలా ఏళ్ళు అంటే.. డైరెక్టర్ కాకముందే పదేళ్లు రవితేజతో సెట్స్ లోనే ఉన్నా… సినిమాల మధ్య గ్యాప్ ఉన్నా, తన లైఫ్ లో మేజర్ పార్ట్ ఆయనతో ఉన్నానని, ఆయన నాతో ఎల్లప్పుడూ ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు. ఫస్ట్ సినిమా ‘షాక్’ ప్లాప్ అయినా కూడా, పిలిచి మిరపకాయ్ అవకాశం ఇచ్చారన్నాడు. ఆ తర్వాత నా లైఫ్ లో చూసుకోవాలని అని తప్ప, మిరపకాయ్ నుండి మిస్టర్ బచ్చన్ కి ఉన్న గ్యాప్ లో కలవని నెలే లేదని, మా బంధం, సినిమాలకి మించి ఉంటుందని అంతే తప్ప వేరే రీజన్ ఏమి లేదని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

మాస్ మహారాజ్ ని 100 టైమ్స్ బెస్ట్ గా చూపించా!

ఇక మిస్టర్ బచ్చన్ సినిమా గురించి హరీష్ ప్రస్తావిస్తూ.. ఈ సినిమా రీమేక్ గా తాము ఎప్పుడూ భావించలేదని, మేము జస్ట్ తమ స్టైల్ లో ఓ సినిమా చేశామని, ఇక మిస్టర్ బచ్చన్ ని ఎంతో ఇష్టపడి చేశామన్నాడు. ఇక హరీష్ శంకర్ రవితేజ గురించి చెప్తూ… మిస్టర్ బచ్చన్ లో నా మాస్ మహారాజ ను ఎంతో మంది ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎలా చూడాలని అనుకుంటున్నారో, అంతకు 100 టైమ్స్ చూపించానని చాలా గర్వంగా చెప్తానని అన్నాడు. అలాగే ఒక హ్యూమర్ అవ్వొచ్చు, సాంగ్స్ అవ్వొచ్చు, హీరోయిజం అవ్వొచ్చు, రవన్న నుండి అభిమానులు ఏం ఆశిస్తారో, అవి వంద రెట్లు ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఇక మిస్టర్ బచ్చన్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ విలన్ గా నటించగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు. మరి ఆగష్టు 15న విడుదల కాబోతున్న మిస్టర్ బచ్చన్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు