Harish Shankar : ఈ దర్శకుడొక మోడ్రన్ రాఘవేంద్ర రావు… అది చూపిస్తే కానీ సినిమా పూర్తి అవ్వదు

Harish Shankar : సినిమాని ఒక్కో దర్శకుడు తీసే విధానం ఒక్కోరకంగా ఉంటుంది. కొందరు దర్శకులు ఒక మంచి కథను చెబుతూ కమర్షియల్ ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తూ ప్రేక్షకుడికి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తారు. కొందరు దర్శకులు తమకు నచ్చినట్టు సినిమా చేస్తారు. ఇంకొందరు దర్శకులు ప్రేక్షకులకు నచ్చినట్టు సినిమాలు చేస్తారు. అతి తక్కువ మంది దర్శకులు మాత్రమే తమకు నచ్చినట్లు సినిమా చేసి ప్రేక్షకులకు కూడా నచ్చే విధంగా చేస్తారు. ప్రస్తుత కాలంలో అటువంటి దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇకపోతే సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అని బలంగా నమ్మే దర్శకుడు హరీష్ శంకర్.

Gabbar Singh

ఎనర్జిటిక్ హీరోలు

జిగర్తాండ సినిమాకి రీమేక్ గా తెరకెక్కించిన గద్దల కొండ గణేష్ (వాల్మీకి) అనే సినిమాలో అధర్వ ఒక మాట చెబుతాడు. “సినిమా ద్వారా ఎడ్యుకేట్ చేయాలి లేదంటే ఎంటర్టైన్ చేయాలి నేను ఎడ్యుకేట్ చేయలేను కాబట్టి ఎంటర్టైన్ చేస్తా” అంటాడు. అలానే నిజజీవితంలో హరీష్ శంకర్ సినిమాలు కూడా ఎంటర్టైన్ గా ఉంటాయి. పదునైన మాటలతో హీరోకి బీభత్సమైన ఎలివేషన్ ఇస్తాడు హరీష్. హరీష్ సినిమాలో హీరోలు చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తారు. అందుకే ఆడియన్స్ కూడా హీరో క్యారెక్టర్ కు బాగా కనెక్ట్ అవుతారు. హీరోను ఎంత పవర్ఫుల్ గా హరీష్ చూపిస్తాడు. అంతే బ్యూటిఫుల్ గా హీరోయిన్ ను కూడా చూపిస్తాడు.

- Advertisement -

Gaddalakonda Ganesh

హీరోయిన్ అందంగా చూపించడం

ఒక హీరోయిన్ అందంగా చూపించడం వేరు, అసభ్యంగా చూపించడం వేరు. ఇంకా హరీష్ విషయానికి వస్తే హీరోయిన్ ను చాలా అందంగా చూపిస్తాడు. అప్పట్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు హీరోయిన్ ని చీరలో ఎంత అందంగా చూపించేవారో.. ప్రస్తుతం ఉన్న దర్శకులలో అలాంటి ప్రయత్నమే చేస్తుంటారు హరీష్. మిరపకాయ్ సినిమా దగ్గర నుంచి గద్దల కొండ గణేష్ సినిమా వరకు హీరోయిన్ ని చాలా అందంగా చూపించాడు హరీష్. గబ్బర్ సింగ్ సినిమా మినహాయిస్తే ప్రతి సినిమాలో కూడా ఎక్కడో ఒకచోట, పాటలు అయినా కూడా హీరోయిన్ నడుము కనిపిస్తుంది. సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ కోసం వెయిట్ చేసినట్లు హరీష్ సినిమాల్లో ఈ షాట్స్ కోసం కూడా వెయిట్ చేసే ప్రేక్షకులు ఉన్నారు.

రాఘవేంద్రరావు ఛాయలు

ఇకపోతే ప్రస్తుతం హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నారు. రవితేజ సరసన భాగ్యశ్రీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి మిక్కిజే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక పాటను విడుదల చేశారు. ఎప్పట్లానే మిక్కీ ఈసారి కూడా తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. మిక్కీ మ్యూజిక్ కి సరిపడా అందమైన విజువల్స్ ను ఈ పాటలో ప్రజెంట్ చేశారు హరీష్. హరీష్ ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఈ తరంలో ఉన్న దర్శకులలో కొద్దిపాటి రాఘవేంద్రరావు ఛాయలు ఉన్న దర్శకులలో హరీష్ ఒకడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు