Harish Shankar: మేము ఇది కావాలని చేయట్లేదు, రెండు సినిమాలు పెద్ద హిట్ అవ్వాలి

Harish Shankar: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లో ఉన్న డైరెక్టర్స్ లో హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షాక్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు హరీష్ శంకర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించుకోలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ రచయితగా కెరీర్ మొదలు పెట్టాడు హరీష్. పూరి జగన్నాథ్ హరీష్ శంకర్ కి మంచి అనుబంధం ఉంది. షాక్ సినిమా అయిపోయిన తర్వాత పూరి జగన్నాథ్ దగ్గర రచయితగా కొన్ని సినిమాలు పనిచేశాడు హరీష్ శంకర్.

అయితే మిస్టర్ బచ్చన్ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అదే రోజున పూరి జగన్నాధ దర్శకత్వం వహించిన డబల్ ఇస్మార్ట్ అనే సినిమా కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఒక పూరి తన కెరీర్లో హిట్ సినిమా చూసి చాలా రోజులు అయింది. ఎన్నో అంచనాలతో వచ్చిన లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. పుష్ప సినిమా ఆగస్టు 15వ తారీకు నుంచి వాయిదా పడటంతో ఆ డేట్ కి ముందుగా డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ సినిమాను అదే డేట్ కి రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. ఇక దీని గురించి హరీష్ శంకర్ ను మీడియా జర్నలిస్టులో సేమ్ డేట్ కి వస్తున్నారు గురువుగారితో పోటీనా అంటూ ప్రశ్నించారు.

Harish Shankar

- Advertisement -

దీనికి హరీష్ సమాధానం ఇస్తూ నా కెరియర్ స్టార్టింగ్ లో వివి వినాయక్ గారు పూరి జగన్నాథ్ గారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. నేను వాళ్ళ దగ్గర చాలా చిన్న వాడిని నేను వాళ్లకు పోటీ అని అసలు అనుకోను. మా సినిమా కంటే ముందు డబల్ ఇస్మార్ట్ సినిమాను అనౌన్స్ చేశారు. అయినా కూడా మిస్టర్ బచ్చన్ సినిమాను ఎందుకు అనౌన్స్ చేశామంటే మీడియా తెలియాలి కాబట్టి చెప్తున్నాను, మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్ శశి గారి వలన ఈ సినిమా ముందు రిలీజ్ చేయవలసి వస్తుంది. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే నేను నెక్స్ట్ రామ్ పోతినేని తో సినిమాను చేయబోతున్నాను. అంటూ తెలిపాడు హరీష్ శంకర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు