Harish Shankar: మీరు అన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది, వి డిడ్ ఏ మిస్టేక్

Harish Shankar: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా చేసిన గద్దల కొండ గణేష్ అనే సినిమా తర్వాత ఇప్పటివరకు హరీష్ శంకర్ దర్శకుడుగా ఒక సినిమా కూడా చేయలేదు. గద్దల కొండ గణేష్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో మాత్రమే హరీష్ శంకర్ సినిమా చేస్తాడు అంటూ వార్తలు రావడం. ఆ తర్వాత ఆ సినిమా పట్టాలెక్కడం కూడా జరిగింది. ముందుగా భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాను చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తెరి అనే ఒక రీమేక్ సినిమాను చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. అయితే హరీష్ శంకర్ రీమేక్ సినిమాను వేరే లెవెల్ లో మార్చగలడంలో ఒక పేరును సాధించాడు కాబట్టి చాలామంది మంచి నమ్మకంతో ఉన్నారు.

అయితే ఆ సినిమాకు ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ఖరారు చేశారు. కేవలం అతి తక్కువ రోజుల్లోనే పవన్ కళ్యాణ్ నుంచి హరీష్ శంకర్ మంచి కంటెంట్ లాగి రెండు టీజర్లను కూడా రిలీజ్ చేశాడు. ఆ రెండు టీజర్ కి విపరీతమైన పేరు వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ చాలా పొలిటికల్ వర్క్స్ వలన బిజీగా ఉండటంతో ఈ సినిమా కోసం డేట్ లను కేటాయించలేకపోయారు. ఈ తరుణంలో రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాను అనౌన్స్ చేశాడు హరీష్ శంకర్. ఆ సినిమాను అనౌన్స్ చేయడంతో పాటు చాలా త్వరగా షూటింగ్ కూడా ఫినిష్ చేసి నేడు ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చాడు.

Mr. Bachchan

- Advertisement -

ఈ సినిమా రిలీజ్ అయినంత వరకు కూడా చాలామందికి మంచి నమ్మకాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంతమేరకు పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. అయితే చాలామంది ఈ సినిమాను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అసలు హరీష్ శంకర్ ఈ సినిమా తీయడం వెనక ఉన్న ఉద్దేశ్యం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు అంటూ కూడా కామెంట్స్ చేశారు. గతంలో తన సినిమాలు సంబంధించి ఎక్కువగా ఎవరికీ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు హరీష్ శంకర్. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రతి కామెంట్ ను, ప్రతి పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడం, చాలామందికి ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. అయితే సినిమాలో కంటెంట్ లేదు కాబట్టి పబ్లిసిటీ పీక్లో చేశారు అంటూ కొంతమంది ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు