Sudheer Babu : ఇంగా సెప్పేదేం లేదు..

సుధీర్ బాబు త‌న కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీగా చేస్తున్న సినిమా హ‌రోమ్ హ‌ర‌. ఈ చిత్రానికి జ్ఞాన‌సాగ‌ర్ ద్వారక ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌గా.. సుమంత్ జి. నాయుడు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ద‌ర్శ‌కుడు త‌న రెండో సినిమా కోసం సరికొత్త కాన్సెప్ట్ ఎంచుకున్నారు.

అక్టోబ‌ర్ 31న మాస్ సంభ‌వం అంటూ.. సుధీర్ బాబు సినిమా టైటిల్‌ని హ‌రోమ్ హ‌ర గా ప్ర‌క‌టించారు. ఇక ఈ టైటిల్ పోస్టర్ ను చూస్తే.. సినిమాలో ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ట్యాగ్ లైన్ ను పరిశీలిస్తే.. కథలో ప్రతీకార కోణం కూడా ఉన్నట్టు అర్థమవుతుంది. సినిమాలో వేసిన సెట్టింగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేసింది.

కాగా.. ఈ చిత్రం 1989 లో ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కుప్పం లో నెలకొన్న కొన్ని పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కించినట్టు తెలుస్తోంది. కుప్పంలోని ప్ర‌సిద్ధ ప్ర‌దేశం సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ఆల‌యం తో పాటు జ‌గ‌దాంబ థియేట‌ర్‌, రైల్వే స్టేష‌న్ వంటి ప్రదేశాలు కనిపిస్తున్నాయి. దీంతో స్టోరీ వీటి చూట్టే తిరుగుతుందని అర్థమవుతుంది.

- Advertisement -

హరోమ్ హరలో ఇప్ప‌టివ‌రకు ఎన్న‌డూ కూడా చూడని మాస్ అవ‌తార్‌లో సుధీర్‌బాబుని చూడ‌వ‌చ్చు. “ఇంగా సెప్పేదేం లేదు… సేసేదే” అని సుధీర్ బాబుని ఒక వ్య‌క్తి త‌న మౌనానికి స్వ‌స్తి చెప్ప‌మ‌ని అడిగాడు. చివ‌ర‌గా సుధీర్ మాస్ గెట‌ప్ ఆక‌ట్టుకుంది. ఒక చేతిలో తుపాకి, మ‌రో చేతిలో సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ఆయుధం అయిన శూలంతో క‌నిపించాడు. ఈ చిత్రానికి చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అర‌వింద్ విశ్వ‌నాథ‌న్ సినిమాటోగ్ర‌ఫీ నిర్వ‌హిస్తుండ‌గా.. ర‌మేష్ కుమార్ జి స‌మ‌ర్పిస్తున్నారు.

హ‌రోమ్ హ‌ర చిత్రాన్ని తెలుగుతోపాటు త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల‌వుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు