Harom Hara: సుధీర్ బాబు హీరో అవ్వడానికంటే ముందు ఏ ఏ పనులు చేశాడో తెలుసా.?

Harom Hara: గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏ మాయ చేసావే నీ సినిమాలు సమంతకు అన్నయ్య పాత్రలో కనిపించాడు సుధీర్ బాబు. ఆ తరువాత ఎస్ఎంఎస్ అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో సుధీర్ బాబు డాన్సులకి చాలామంది ఫిదా అయ్యారు. ఆ సినిమా ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. ఇకపోతే సుధీర్ బాబు వరుసగా చేసిన సినిమాలు ఫెయిలవుతూ వచ్చాయి. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనం సినిమా మంచి హిట్ అయింది.
ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు సుధీర్ బాబు.

సుధీర్ బాబు జర్నీ

ప్రతి హీరో కూడా ఒక ప్రత్యేకమైన జర్నీ ఉంటుంది. కొంతమంది హీరోగా కంటే కూడా ముందు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తమను తాము ప్రూవ్ చేసుకొని, తర్వాత గుర్తింపు ఉన్న పాత్రలు చేసి, ఆ తర్వాత హీరోలుగా కూడా సినిమాలు చేస్తారు. ఇకపోతే సుధీర్ బాబు జర్నీ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఈ విషయాన్ని స్వయంగా సుధీర్ బాబు రీవీల్ చేశారు. సుధీర్ బాబు హీరోగా కంటే ముందు డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదలు పెట్టాడట. గుంటూరు వైజాగ్ ప్రాంతంలో చాలా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశానంటూ చెప్పుకొచ్చాడు.

Sudheer Babu

- Advertisement -

డిస్ట్రిబ్యూటర్ గా జర్నీ

సుధీర్ బాబు డిస్ట్రిబ్యూటర్ గా చేసిన జర్నీలో చాలా మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. ఆర్య, రణం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, సై అంటే సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాడట. అయితే ఈ సినిమా అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించాయి. మామూలుగా డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ సాధించిన తర్వాత ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇవ్వాలని ఆలోచన చాలా మందికి వస్తుంది. కానీ సుధీర్ కి ఎన్నో ప్యాషన్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే సుధీర్ బాబు తన ఫ్రెండ్స్ తో పాటు ఈ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. Uv క్రియేషన్స్ వంశీ, 70 ఎం ఎం క్రియేషన్స్ విజయ్ తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతూ వచ్చాడు. Uv క్రియేషన్స్ వంశీ అన్ని దగ్గరుండి చూసుకునేవాడు. డిస్ట్రిబ్యూటర్ గా 100% సక్సెస్ రేట్ ఉందని చెప్పుకొచ్చాడు.

హరోం హర సినిమాతో ప్రేక్షకులు ముందుకు

ప్రస్తుతం సుధీర్ బాబు చేస్తున్న సినిమా హరో హర ఈ సినిమా జూన్ 14న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కుప్పం బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని చాలామంది అంచనా వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు