Harom Hara : ఊహించని షాకిచ్చిన సెన్సార్ బోర్డు.. దాని ప్రభావం ఉంటుందా?

Harom Hara : టాలీవుడ్ సుధీర్ బాబు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైం అవుతుంది. అప్పుడెప్పుడో సమ్మోహనం సినిమాతో మంచి హిట్ అందుకున్న సుధీర్ బాబు మళ్ళీ మంచి చిత్రాలు ఎన్నో చేసినా ఆశించిన హిట్ మాత్రం దక్కలేదు. ఇక సుదీర్ బాబు ఓ మంచి హిట్ కోసం చాలా టైంగా ఎదురు చూస్తుండగా, లాస్ట్ ఇయర్ వచ్చిన మామా మశ్చ్చింద్ర కూడా నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకోగా, ఇప్పుడు “హరోం హర” (Harom Hara) అంటూ క్రేజీ సినిమాతో వస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆ సినిమాపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, లేటెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరుపుకుంది. ఇక డీసెంట్ అంచనాల నడుమ హరోం హర ఈ వీకెండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న హరోం హర సినిమా జూన్ 14న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధం అవుతుంది.

Harom Hara movie received A certificate

హరోం హర యూనిట్ కి షాకిచ్చిన సెన్సార్ బోర్డ్…

సుధీర్ బాబు హరోంహర ట్రైలర్ సినిమా మీద మంచి క్రేజీ అంచనాలను అయితే ఏర్పడేలా చేసింది. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ కి వెళ్లగా సెన్సార్ బోర్డు వాళ్ళు ఊచించని షాకిచ్చారు. హరోం హర సినిమాకి A సెర్టిఫికెట్ ని అవ్వడం జరిగింది. వైలెన్స్ ఎక్కువగా ఉన్న కారణంగా ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారని తెలుస్తుంది. అయితే A సర్టిఫికెట్ రావడం వల్ల సినిమా టాక్ పై ప్రభావం ఉంటుందా అని చిత్ర యూనిట్ కంగారు పడుతున్నట్టు సమాచారం. అయితే కొందరు ట్రేడ్ విశ్లేషకులు ఇది కంగారు పడాల్సిన విషయం కాదని అంటున్నారు. గతంలో సలార్ వలాంటి భారీ పాన్ ఇండియా సినిమాలకి కూడా ఎ సర్టిఫికెట్ రాగా, అది సినిమాపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఇప్పుడు మంచి టాక్ తెచ్చుకుంటే హరోంహర కి కూడా ప్రభావం ఉండదని మంచి కలెక్షలను వసూల్ చేస్తుందని అంటున్నారు. ఇక హరోంహర సినిమాకి రన్ టైం 2 గంటల 34 నిముషాలుగా సెట్ అయింది.

- Advertisement -

సుధీర్ బాబు కం బ్యాక్ ఇస్తాడా?

ఇక ఈ సినిమా లో మాస్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉండటంతో ఆడియన్స్ ను అలరించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక జ్ఞానసాగర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సుమంత్ నాయుడు నిర్మించడం జరిగింది. ఇక సినిమాకి ఇప్పుడు మంచి హిట్ అయ్యి సుదీర్ బాబుకి మంచి కంబ్యాక్ ని ఇచ్చే అవకాశం ఎంతైనా ఉండగా, ప్రభాస్ నటించిన కల్కి 2898AD సినిమా సైతం రావడానికి ఇంకా 2 వారాల టైం ఉండటంతో, ఈ గ్యాప్ లో రిలీజ్ అవుతున్న నోటబుల్ మాస్ మూవీ హరోం హర సినిమానే అవ్వడం, అలాగే ఈ సినిమాకి డీసెంట్ బజ్ కూడా ఉండటంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ అవ్వడానికి సుధీర్ బాబు కి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.ఇక హరోం హర సినిమాని నైజాం లో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా, పలు చోట్లలో నిర్మాతలు ఓన్ రిలీజ్ కూడా చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు