HaromHara Teaser Talk: సమరం మొదలెట్టిన ‘కుప్పం సుబ్రహ్మణ్యం’…

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ ఆక్టర్స్ లో సుధీర్ బాబు ఒకరు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా కథ నచ్చితే దానికి ప్రాణం పెట్టేస్తాడు. స్క్రిప్ట్ సెలెక్షన్ల లో కూడా ఎప్పటికప్పుడు కొత్త వేరియషన్లను చూపిస్తాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ‘మామ మశ్చీంద్ర’ సినిమాలో కూడా త్రిపాత్రాభినయం తో ఆడియన్స్ ని అలరించాడు. అయితే ఆ సినిమా అంతగా మంచి రెస్పాన్ ని తెచ్చుకోలేదు గాని, సుధీర్ బాబు నటనకి మంచి మార్కులు పడ్డాయి.

ఇక లేటెస్ట్ గా సుధీర్ బాబు “హరోం హర” అంటూ ఒక డిఫరెంట్ కమర్షియల్ మూవీ తో రానున్నాడు. ఇంతకు ముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్ కూడా ఆకట్టుకోగా, తాజాగా హరోంహర టీజర్ రిలీజ్ అయింది. జ్ఞానసాగర్ ద్వారక డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సుమంత్ నాయుడు నిర్మిస్తున్నాడు.

ఇక రిలీజ్ చేసిన టీజర్ ని గమనిస్తే సుధీర్ ఈ సినిమాలో ఒక కొత్త తరహా పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. టీజర్ లో ఒక రౌడీలా కనిపిస్తున్నా కథ నేపథ్యం అది కాదనిపిస్తుంది. నార్మల్ గా సగటు మనిషి లా బతికే సుధీర్ అనుకోని కారణాల వల్ల ఒక పెద్ద స్థాయికి ఎదుగుతాడు. అయితే అది నెగిటివా, లేక పాజిటివ్ గానా అన్న సస్పెన్స్ లో ఉంచారు. టీజర్ లో లాస్ట్ చెప్పే డైలాగ్ మాత్రం అదిరిపోయింది. వాడు సమరం మొదలు పెడితే. ఆ సంభవానికి సంతకం నాదైతాది అని చెప్తుంటే ఒక ప్రస్థానం లాంటి సినిమాలు గుర్తు రాక మానవు.

- Advertisement -

ఏది ఏమైనా టీజర్ కట్స్ కూడా చాలా బాగుండగా, దానికి తగ్గట్టు చైతన్య భరద్వాజ్ ఇచ్చిన బీజీఎమ్ కూడా బాగుంది. ఇక హరోం హర సినిమాని 2024 సమ్మర్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు