Harom Hara: దర్శకుడి ఇష్టం బయట పడింది , సుధీర్ బాబుకి కొత్త బిరుదు ఇచ్చాడు

Harom Hara: ప్రతి దర్శకుడికి తమకంటూ ఒక ఫేవరెట్ హీరో ఉండటం సహజం. అయితే చాలామంది దర్శకులు తమకి ఇష్టమైన హీరోతో సినిమా చేయాలని కలలు కంటారు. ఆ కనిని కలలు నిజమైన రోజు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తారు. అయితే అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధిస్తాయని కచ్చితంగా చెప్పలేం. కానీ కొన్ని సినిమాలు మొత్తం బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతాయి. పవర్ స్టార్ కి అభిమాని అయిన హరీష్ శంకర్ తీసిన సినిమా గబ్బర్ సింగ్ ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది.

Sudheer Babu

ఇకపోతే ఎస్ఎంఎస్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. సుధీర్ బాబు తన కెరీర్లో ఎన్నో ఎక్స్పరిమెంటల్ ఫిలిమ్స్ కాన్సెప్ట్ బేస్ ఫిలిమ్స్ చేసినా కూడా సరైన గుర్తింపు దక్కలేదు అని చెప్పాలి. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనం సినిమా మంచి హిట్ అయింది. ఆ తర్వాత అదే దర్శకుడు తీసిన ఒక అమ్మాయి తప్ప సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అయితే చాలామంది సుదీర్ బాబుకి మంచి టాలెంట్ ఉంది కానీ సరైన హిట్ సినిమా పడలేదు అని అంటూ ఉంటారు.

- Advertisement -

ప్రస్తుతం సుధీర్ బాబు చేసిన సినిమా హరోం హర. ఈ సినిమాకి జ్ఞాన సాగర్ దర్శకత్వం వహించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే సుధీర్ బాబుకి టాలెంట్ ఉంది గాని హిట్ లేదు అని నేను విన్నాను సరే ఆ హీట్ ఎదో మనమే ఇస్తే పోలా అని అనుకున్నాను అంటూ దర్శకుడు ఒక సందర్భంలో మాట్లాడాడు. అలా చెప్పిన మాదిరిగానే ఈ సినిమాలో భారీ ఎలివేషన్ సుధీర్ బాబుకి ఇచ్చాడు. విక్రమ్ కేజీఎఫ్ స్థాయిలో ఎలివేషన్స్ ఇచ్చాడు. ఈ సినిమా చివర్లో నవ దళపతి అంటూ టైటిల్ కార్డు వేశాడు. ఎంతో ఇష్టంతో చేసాడు అని ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి అనిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు