Harom Hara Twitter review: సుధీర్ బాబు వన్ మ్యాన్ షో.. గట్టి కం బ్యాక్..!

Harom Hara Twitter review: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, ప్రముఖ హీరో సుధీర్ బాబు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు కొన్ని సంవత్సరాలు అవుతున్నా.. సరైన హిట్టు లేక సతమతమవుతున్న విషయం తెలిసిందే. అందుకే ఈసారి ఎలాగైనా సరే విజయం సాధించాలని పట్టుబట్టి కూర్చున్నాడు.. ఇక అందుకు తగ్గట్టుగానే హరోం హర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సుధీర్ బాబు..శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ ద్వారక దర్శకత్వం వహించారు.. ఇక ఎట్టకేలకు జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఓవర్సీస్ లో సినిమాని చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు.. అయితే సినిమా ట్విట్టర్ రివ్యూ తెలుసుకునే ముందు.. ఈ సినిమా ఎలా ఉంది అనే విషయానికొస్తే..

Harom Hara Twitter review: Sudheer Babu's one man show.. hard come back..!
Harom Hara Twitter review: Sudheer Babu’s one man show.. hard come back..!

వన్ మ్యాన్ షో గా హరోంహర..

•మాస్ ప్రియులకు ఇది మంచి విందు అని చెప్పవచ్చు..

- Advertisement -

•ఈ సినిమాలో సుధీర్ బాబు తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.. సుదీర్ బాబు మిగతా సినిమాల కంటే కూడా ఈ సినిమాలో హీరో పెర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉందని చెప్పాలి.

•హీరో క్యారెక్టర్రైజేషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. సుధీర్ బాబు తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు.. చిత్తూరు బ్యాక్ డ్రాప్ ,స్లాంగు పుష్ప సినిమాను గుర్తుచేస్తుంది.

•అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగున్నాయి

•ప్రత్యేకంగా ఇంటర్వెల్లో వచ్చే యాక్షన్ బ్లాక్ అయితే అదిరిపోయింది. పైగా ఈ సినిమాకి మేజర్ హైలెట్ సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సన్నివేషాలని చెప్పాలి.. ఇక చైతన్య భరద్వాజ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి థియేటర్లు దగ్గరిల్లాయి..

•చివరిగా దర్శకుడిలో విషయం ఉంది అని తేలిపోయింది

•మొత్తానికైతే సుధీర్ బాబు వన్ మ్యాన్ షో గా అదరగొట్టేసారు..

విశ్లేషణ:

మాస్, యాక్షన్ చిత్రాల కోసం చూసేవారికి ఈ సినిమా చాలా అద్భుతంగా నచ్చుతుంది అని చెప్పవచ్చు.

ప్రేక్షకులు అభిప్రాయాలు..

నెటిజన్స్ ఈ సినిమాను చేసిన తర్వాత ఒక్కొక్కరిగా తమ అభిప్రాయాలను ట్విట్టర్ రివ్యూ లు పంచుకున్నారు. మరి నెటిజెన్స్ అభిప్రాయాల గురించి ఇప్పుడు చూద్దాం.

సుధీర్ బాబు మరోసారి మంచి ప్రాజెక్టుతో వచ్చాడు. చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ ఈ సినిమాకి అత్యంత బలం.. సినిమాటోగ్రఫీ యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి.. ముఖ్యంగా వెరీ గుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ.. తప్పకుండా చూడవచ్చు అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.

హరోం హర మేడ్ మాస్ చిత్రం.. మొత్తాన్ని నేను ఎంజాయ్ చేశాను.. చాలా బాగా నచ్చింది.. ఈ సినిమా థీమ్ కలర్ ప్యాటర్న్ ఫర్ఫెక్ట్ గా ఉన్నాయి. బిజీఎం సినిమా ఆటోగ్రఫీ హైలెట్.ముఖ్యంగా సుధీర్ బాబులు పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేశాడు. నాకు బాగా నచ్చింది అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

సుబ్రహ్మణ్యం కేరాఫ్ కుప్పం. ఫస్ట్ ఆఫ్ బ్లాక్ బస్టర్ ఈ సినిమాకి బిజిఎం ప్రాణంగా నిలిచింది. సుదీర్ బాబు వన్ మ్యాన్ షో.. ముఖ్యంగా హరోం హరా సినిమా తప్పకుండా చూడాల్సిన మూవీ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు