HBD Havish : పక్కా కమర్షియల్ సినిమాగా వస్తున్న “YES BOSS”…

HBD Havish : తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఇప్పుడు యువ కధానాయకుల జోరు కొనసాగుతోంది. టాలెంట్ ఉన్న ఎవరైనా ఇండస్ట్రీలో తమను తాము నిరూపించుకోవచ్చు. వాళ్ళు వారసత్వం నుండి వచ్చినా, సొంత ప్రతిభతో ఎంట్రీ ఇచ్చినా, ఇండస్ట్రీ లో టాలెంట్ ఉంటే ఏనాటికైనా బ్రేక్ వస్తుంది. అలా ఇప్పటికే చాలా మంది యువ హీరోలు యువతను ఆకట్టుకునే కథాంశాలతో హిట్లు సాధించారు. సుహాస్, శ్రీ విష్ణు, సత్య దేవ్ వంటి హీరోలు చిన్న చిన్న పాత్రలు చేస్తూనే ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోలుగా రాణిస్తున్నారు. ఇక ఇప్పటికీ చాలా మంది హీరోలు సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా తమ టాలెంట్ తో ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోవలోనే మరో యువ కథానాయకుడు ‘హవీష్’ విభిన్న కథాంశాలతో ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. జీనియస్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన హవీష్ మొదటి సినిమాతోనే ప్రేక్షకులని మెప్పించాడు. ఆ తర్వాత హవీష్ నటించిన నువ్విలా, సెవెన్ వంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి.

Havish's new movie "YES BOSS" first look poster released

 

- Advertisement -

ఫలితం తో సంబంధం లేకుండా ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం..

అయితే హవీష్ హీరోగా నటించిన సినిమాలతో ఇప్పటి వరకూ కమర్షియల్ హిట్ దక్కలేదు. తన నటనతో ప్రేక్షకులని మెప్పిస్తున్నా కమర్షియల్ సక్సెస్ మాత్రం ఈ యువ హీరో హవీష్ ఖాతాలో పడలేదు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులని మెప్పించడానికి రెడీ అయ్యాడు. హవీష్ హీరోగా ఇప్పుడు పూర్తి స్థాయి కమర్షియల్ జోనర్ లో ఓ సినిమాతో రానున్నాడు. హవీష్ బర్త్ డే స్పెషల్ గా తాను నటిస్తున్న కొత్త సినిమా పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక హవీష్ నటిస్తున్న కొత్త సినిమా పేరును ” YES BOSS ” గా ఫిక్స్ చేసారు. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

పిల్ల జమిందార్ డైరెక్టర్ తో సినిమా…

ఇక హవీష్ హీరోగా నటిస్తున్న ‘యెస్ బాస్’ (HBD Havish) సినిమాని పిల్లజమీందర్ ఫేమ్ దర్శకుడు జి. అశోక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులు కాగా, తాజా సమాచారం ప్రకారం ” YES BOSS ” మూవీ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పటి యువత ఆకట్టుకునేలా, పూర్తి కమర్షియల్ హంగులతో నిర్మించిన ఈ సినిమా హవీష్ కు మంచి హిట్ అందిస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు. మరి ఈ సినిమాతో నైనా హవీష్ ఒక సూపర్ హిట్ కొట్టి ఇండస్ట్రీలో తన సత్తా చాటుతాడేమో చూడాలి. ఇక ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న “హవీష్” కి ఫిల్మీ ఫై తరపున బర్త్ డే విషెస్ ని అందచేస్తూ, హవీష్ ప్రేక్షకులు మెచ్చే మంచి చిత్రాలతో తన కెరీర్ కొనసాగించాలని కోరుకుంటున్నాము.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు