HBD Allari Naresh: అన్నదమ్ములు ఇద్దరూ ఒకే అమ్మాయి కోసం అలాంటి పని.. కట్ చేస్తే..!

HBD Allari Naresh.. ప్రముఖ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నరేష్ మొదట రవిబాబు డైరెక్షన్లో వచ్చిన అల్లరి సినిమా ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకోవడమే కాదు ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. అలా అల్లరి నరేష్ గా సినీ ఇండస్ట్రీలో చలామణి అవుతున్న ఈయన ఎక్కువగా కామెడీ సినిమాలు చేస్తూ కామెడీ హీరోగా పేరు దక్కించుకున్నారు. అయితే వరుసగా కామెడీ సినిమా చేస్తూ రావడంతో ప్రేక్షకులకు బోర్ కొట్టేశారు. దీంతో కొంతకాలం ఈయన తీసిన సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.. ఫలితంగా కొద్దిరోజులు ఈయన ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది..

అన్నదమ్ములిద్దరూ ఒకే అమ్మాయి తో లవ్..

HBD Allari Naresh: Both brothers work for the same girl.. if cut..!
HBD Allari Naresh: Both brothers work for the same girl.. if cut..!

ఆ తరువాత నాంది సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్ ఏకంగా తనలోని విశ్వరూపాన్ని చూపించేశారు. ఇందులో సీరియస్ పాత్ర చేసి మెప్పించారు..ఆ తర్వాత ఈయన చేసే పాత్రలన్నీ కూడా ఆ విధంగానే వస్తున్నాయి.. దాదాపు సీరియస్ పాత్రలో నటిస్తూ తాను కామెడీ హీరోనే కాదు సీరియస్ పాత్రల్లో కూడా మెప్పించగలను అని నిరూపించాడు.. ఇదిలా ఉండగా ఈరోజు ఈయన పుట్టినరోజు ఈయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఈ క్రమంలోనే అన్నదమ్ములు ఇద్దరు ఒకే హీరోయిన్ ని ప్రేమించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.. అయితే ఈ విషయాన్ని తాజాగా అల్లరి నరేష్ మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.

ఆ తప్పు చేసాము..

అల్లరి నరేష్ అన్నయ్య ఆర్యన్ రాజేష్ కూడా సినీ ఇండస్ట్రీలో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎవడి గోల వాడిదే సినిమాలో రాజేష్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. ఇదిలా ఉండగా అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమా మే 3వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ప్రేక్షకుల చేత పరవాలేదు అనిపించుకున్నారు.. పెళ్లికాని వ్యక్తి మ్యాట్రిమోనీ సంస్థల చుట్టూ తిరుగుతూ ఎదుర్కొనే ఇబ్బందులను ఫన్నీగా చూపించడం జరిగింది.. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అల్లరి నరేష్ తన సోదరుడు ఆర్యన్ రాజేష్ తో కలిసి నటించడంపై అలాగే.. ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని ప్రేమించడం పై క్లారిటీ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. మీ బ్రదర్ ఆర్యన్తో కలిసి నటించే ఆలోచన ఉందా అని అడగ్గా ఇప్పట్లో లేదని.. దానికి కారణం గతంలో మేమిద్దరం కలిసి నటించి ఒక పెద్ద తప్పు చేసాము అని తెలిపారు..

- Advertisement -

జనాలు ఛీ కొట్టారు..

ఇదిలా ఉండగా వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం నువ్వంటే నాకిష్టం.. అల్లరి నరేష్ నాన్నగారు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కింది.. ఇందులో రాజేష్ నేను కలిసిన నటించడం వల్ల తప్పు జరిగింది.. ఆ సినిమాలో మేమిద్దరం ఒకే అమ్మాయిని ప్రేమిస్తాము.. అయితే ఆ సినిమాల్లో మేమిద్దరం అన్నదమ్ములం కాదు.. కానీ నిజానికి మేమిద్దరం అన్నదమ్ములం కదా.. ఆ మూవీలో మేమిద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించేసరికి ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. బ్రదర్స్ ఒకే అమ్మాయితో ప్రేమలో పడడం ఏంటి ? అంటూ జనాలు ఛీ కొట్టారు.. ఫలితంగా సినిమా డిజాస్టర్ అయ్యింది.. అందుకే అప్పటి నుంచి మేము ఇద్దరం కలిసి నటించాలని అనుకోవట్లేదు అంటూ స్పష్టం చేశారు అల్లరి నరేష్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు