HBD Anasuya: అనసూయ మొదటి సంపాదన ఎంతంటే..?

HBD Anasuya.. స్టార్ యాంకర్ అనసూయ ఒకవైపు యాంకర్ గా రాణిస్తూనే మరొకవైపు పలు సినిమాలతో బిజీగా మారిపోయింది..ఇప్పటికే ఎన్నో సినిమాలలో కీలకపాత్రలో నటించి మెప్పించిన ఈమె ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న నేపథ్యంలో ఈమెకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఈ క్రమంలోనే అనసూయ మొదటి సంపాదన ఎంత అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

న్యూస్ రీడర్ గా కెరియర్ మొదలు..

సాక్షి న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత జబర్దస్త్ లోకి యాంకర్ గా ప్రవేశించింది. అక్కడ దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు యాంకర్ గా కొనసాగుతూ స్టార్ యాంకర్ గా పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా వరుస సినిమాలలో అవకాశాలు సొంతం చేసుకుంటూ ఇప్పుడు స్టార్ యాక్ట్రెస్ గా కూడా పేరు సొంతం చేసుకోవడం గమనార్హం.. ముఖ్యంగా అనసూయ ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు పాన్ ఇండియా చిత్రాలలో కూడా నటిస్తూ మరింత గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమె పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలోనూ గుర్తింపు..

HBD Anasuya: What is Anasuya's first earnings?
HBD Anasuya: What is Anasuya’s first earnings?

ఇకపోతే కాస్త సమయం దొరికితే చాలు సోషల్ మీడియాకే పరిమితమయ్యే ఈమె తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా అప్పుడప్పుడు సమాజంలో జరిగే ప్రతి విషయాలపై కూడా స్పందిస్తూ ఉంటుంది అందుకే ఒక్కొక్కసారి ఈమె చేసే కామెంట్స్ వల్ల ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది అనడంలో సందేహం లేదు.ఇకపోతే తాజాగా అనసూయకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారడంతో ఈమె మొదటి సంపాదన ఎంత ఎలా సంపాదించింది అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి

- Advertisement -

మొదటి సంపాదన ఎంతంటే..

ఇకపోతే అనసూయ కాలేజ్ లో చదువుకున్న సమయంలోనే ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ సినిమాలో అవకాశం వచ్చింది. అందులో చిన్న పాత్రలో అనసూయ నటించింది. ఇకపోతే ఈ సినిమాలో సునీల్ వెనకాల నిల్చొని మనకు కనిపిస్తుంది. ఇక ఈ పాత్రకు ఆమెకు ఎటువంటి డైలాగులు లేవు.. అలా కనిపించినందుకుగానూ 500 రూపాయలు పారితోషకంగా అందించారంట. ఇక అప్పట్లో జూనియర్ ఆర్టిస్టులకు ఈ రేంజ్ లోనే పారితోషకం ఇచ్చేవారు అని సమాచారం..

అనసూయ కెరియర్..

ఇకపోతే ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ మరింత బిజీగా మారుతున్న విషయం తెలిసిందే. అలాగే గ్లామర్ విషయంలో కూడా అందాలను ఒలకబోయడంలో ఈమె తర్వాత ఎవరైనా.. ఇకపోతే సినిమాలే కాదు కెరియర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది.. ఈ మధ్య కాస్త సమయం దొరికితే చాలు తన భర్త పిల్లలతో వెకేషన్ కి వెళ్తూ బీచ్ లలో సందడి చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. మరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా పలు ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు పలువురు అభిమానులు సెలబ్రిటీలు కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు