HBD Ashish Vidyarthi : ప్రతినాయక పాత్రలకు కేరాఫ్ ఈ విలక్షణ నటుడు…

HBD Ashish Vidyarthi : “ఆశిష్ విద్యార్థి”… తెలుగు సినిమాల్లో 20స్ లో అగ్ర హీరోల సినిమాలలో ప్రతినాయక పాత్రలకి కేరాఫ్ గా నిలిచిన నటుడు ఈయన. పూరి జగన్నాథ్, వివి వినాయక్, శ్రీను వైట్ల వంటి దర్శకుల సినిమాల్లో రెగ్యులర్ విలన్ ఈయన. ఆరడుగుల విలన్ ఎదురుగా ఉన్నా, తన హావభావాలతోనే అద్భుతమైన విలనిజం పండించగల నటుడు ఈయన. ఒక్క తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో విలక్షణ నటనతో మెప్పిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారీయన. కేవలం ప్రతినాయక పాత్రల్లోనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా మంచి పాత్రలు చేస్తూ తనదైన నటనతో దూసుకుపోతున్నాడు. తెలుగు చిత్ర సీమలో చాలా మందికి ఈయన ప్రతినాయకుడిగానే ఎక్కువగా పరిచయం. కానీ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నేటితరం నటుల్లో విలక్షణ నటులలో ఈయన ఒకరు. ఎలాంటి పాత్ర ఇచ్చినా భాషతో కాకుండా, భావంతో హావభావాలను, వైవిధ్యతని ప్రదర్శించే నటుడు ఆశిష్ విద్యార్థి. అంతటి పేరు పొందిన ఆశిష్ విద్యార్థి బర్త్ డే (జూన్ 19) నేడు. ఈ సందర్బంగా ఆశిష్ విద్యార్థికి (HBD Ashish Vidyarthi) బర్త్ డే విషెస్ అందచేస్తూ, వెండితెరపై చెరగని ముద్ర వేసిన ఈ అద్భుతమైన నటుడి గురించి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం.

HBD Ashish Vidyarthi Birthday Special

విలక్షణ నటనకు మారుపేరు…

ఆశిష్ విద్యార్థి తాను స్కూల్లో ఉన్న రోజుల నుండే నాటక రంగం లో రానిస్తూ, స్టేజిపై పలు ప్రదర్శనలు ఇచ్చేవారు. కళాకారుల కుటుంబంలోనే జన్మించిన ఆశిష్ కళాత్మక వారసత్వంతో సినిమాల్లో రాణించాలని వచ్చాడు. తెలుగులో పాపే నా ప్రాణం అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు, శ్రీరామ్ అనే చిత్రంలో విలన్ గా మంచి పేరు తెచ్చుకోగా, గుడుంబా శంకర్ వంటి చిత్రాల్లో అవకాశం రావడంతో విలన్ గా తెలుగులో పాపులర్ అయ్యాడు ఆశిష్ విద్యార్థి. అయితే జనాల్లోకి బాగా వెళ్ళింది మాత్రం పోకిరి లో ఎన్కౌంటర్ శంకర్ పాత్ర. ఆ సినిమాలో సూపర్ గా విలనిజం చూపించాడు. ఆ తర్వాత చిరుత, అతిథి, అన్నవరం వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇక విలన్ గానే కాకుండా కామెడీ విలన్ గా కెవ్వు కేక, కిక్ 2, అలా మొదలైంది వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. అయితే ఆశిష్ విద్యార్థి ప్రతినాయక పాత్రల్లోనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుడు, రైటర్ పద్మభూషణ్, లక్ష్యం, కల్యాణ వైభోగమే వంటి చిత్రాల్లో మెప్పించారు.

- Advertisement -

హాలీవుడ్ లోనూ నైపుణ్యం..

ఇక ఆశిష్ విద్యార్థి తెలుగు, హిందీలో ఎక్కువ చిత్రాలు చేయగా, మిగతా సౌత్ భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే ఒక్క ఇండియన్ భాషల్లోనే కాకుండా ఆశిష్ విద్యార్థి హాలీవుడ్ సినిమాలో కూడా నటించారు. అతని నటనకి నిదర్శనంగా, 2000లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘నైట్‌ఫాల్’లో తన నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం లభించింది. ఈ సైన్స్-ఫిక్షన్ థ్రిల్లర్ ని, గ్వినేత్ గిబ్బీ దర్శకత్వం వహించారు. ఇక ఆశిష్ విద్యార్థి తన కెరీర్‌ లో అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. ఇక ఆశిష్ విద్యార్థి అద్భుత నటనకు ‘ద్రోహ్కాల్’ (1995) చిత్రానికి గాను ఉత్తమ సహాయనటుడిగా జాతీయ నటుడిగా అవార్డు సైతం అందుకున్నారు. ఇక తెలుగులో ‘మిణుగురులు’ (2013) చిత్రానికి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు అందుకున్నారు. ఇక ఆశిష్ విద్యార్థి వ్యక్తిగత లైఫ్ విషయానికి వస్తే… తన భార్య రాజోషి బౌరా కే విడాకులు ఇచ్చి, లాస్ట్ ఇయర్ అరవై ఏళ్ళ వయసులో రూపాలి అనే మహిళని పెళ్లిచేసుకున్నాడు. ఇక తనదైన శైలిలో ఆశిష్ విద్యార్థి సినిమాలు, వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ మెప్పిస్తున్నాడు. రీసెంట్ గా రానా నాయుడు వెబ్ సిరీస్ తో మెప్పించిన ఈ నటుడు, త్వరలో సీక్వెల్ తో పలకరించనున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు