HBD Balakrishna : ఈ ప్రయోగాలతో రికార్డులు.. బాలయ్యకే సాధ్యం

HBD Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ.. నటరత్న ఎన్టీ రామారావు నటవారసుడిగా ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ, నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తూ ఇప్పటికీ యంగ్ స్టార్స్ కి పోటీనిస్తూ తన సత్తాని చూపిస్తున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బాలయ్య తన తొడగొడితే రికార్డులు.. మీసం తిప్పితే రివార్డులు అన్నట్టు ఉంటాయి ఆయన సినిమాలు. మేనరిజంలోనే కాదు డైలాగ్ డెలివరీలోనూ బాలకృష్ణ స్టైలే వేరు. ఈ నాలుగు దశాబ్దాలలో బాలకృష్ణ తన కెరీర్​లో సాధించిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు బాలయ్య చేస్తున్న సినిమాలు కాదు గాని, బాలయ్య సినిమాలంటే 90స్ లో ఓ ఊపు ఊపాయి. టాలీవుడ్ లో పాత్ర కోసం ఎంతైనా రిస్క్ చేసే హీరోల్లో బాలకృష్ణ ముందుంటారు. అలాంటి కీర్తి ఘడించిన బాలకృష్ణ పుట్టిన రోజు(జూన్ 10) నేడు. ఈ సందర్బంగా ఆయనకీ బర్త్ డే (HBD Balakrishna) విషెస్ ని అందచేస్తూ, బాలయ్యకే సాధ్యమైన అరుదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం.

HBD Balakrishna Birthday Special Movies Story

పౌరాణిక, భక్తిరసాల్లో తనదైన శైలి..

తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ‘తాతమ్మ కల’ సినిమాతో తెరంగేట్రం చేసిన బాలకృష్ణ ఇప్పటివరకు 108 సినిమాలు పూర్తి చేసుకున్నారు. తెరమీద తెర వెనుక శ్లోకాలు, పద్యాలను అవలీలగా చెప్పగల నటుడు బాలయ్య. ఇప్పుడున్న నటుల్లో పౌరాణిక, సాంఘికం, జానపదం, సైన్స్‌ఫిక్షన్‌ ఇన్ని జానర్లను టచ్‌ చేసిన హీరో బాలకృష్ణ. చెంఘీజ్‌ఖాన్‌, గోన గన్నారెడ్డి పాత్రలో నటించాలనేది బాలయ్య కోరిక.

- Advertisement -

ఒకే ఏడాది డబుల్ హ్యాట్రిక్..

ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా 1987లో 8 సినిమాలు విడుదలయ్యాయి. అవన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. భార్గవరాముడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, రాము, సహస సామ్రాట్, మువ్వా గోపాలుడు, భానుమతి గారి మొగుడు సినిమాల్తో ఒకే ఏడాది డబుల్ హ్యాట్రిక్ అందుకున్నారు.

అత్యధిక చిత్రాల్లో ద్విపాత్రాభినయం..

ఇక 100 కి పైగా సినిమాలు చేసిన బాలయ్య ఓ అరుదైన ఘనత ఖాతాలో వేసుకున్నారు. టాలీవుడ్​లో రెండో తరం హీరోలలో అత్యధిక సినిమాల్లో డ్యుయల్ రోల్ ​లో నటించిన రికార్డు బాలయ్య పేరిటే ఉంది. ఆయన కెరీర్​లో ఇప్పటిదాకా 17 సినిమాల్లో ద్విపాత్రాభినయం పాత్ర పోషించారు.

సింహ సెంటిమెంట్..

ఇక నటసింహం అని బిరుదు అందుకున్న బాలకృష్ణ ఆధ్యాత్మికంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తులు. ఆయన నటించిన చాలా సినిమాలలో సింహా అని టైటిల్ ని వేయించుకున్నాడు. ఆయన హీరోగా ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘లక్ష్మీనరసింహా’, ‘సింహా’, ‘వీరసింహారెడ్డి’ బ్లాక్ బస్టర్ హిట్​ అయ్యాయి.

అల్ రౌండర్..

ఇక ఇండస్ట్రీలో నరసింహమైన బాలకృష్ణ అన్ని రకాల పాత్రలు చేసి అరుదైన ఘనత సాధించారు. పౌరాణికం, జానపదం, సాంఘిక చిత్రాలతో పాటు సైన్స్ ఫిక్షన్ జోనర్ లో కూడా సినిమా చేసారు. అలాగే ఫ్యామిలీ,రొమాంటిక్, కామెడీ, యాక్షన్ జోనర్లలో తనదైన సత్తా చాటారు. అయితే మాస్ సినిమాలకి పెట్టింది పేరుగా బాలయ్య నిలిచారు. ‘ఆదిత్య 369’, భైరవద్వీపం వంటి చిత్రాలతో బాలకృష్ణ తెలుగులో నటనాపరంగా ఎంతో వైవిధ్యాన్ని చూపించారు. ఇక ఇప్పుడు కూడా అఖండ, వీరసింహారెడ్డి వంటి భారీ విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతూ, యంగ్ హీరోలకు కూడా పోటీనిస్తున్నారు. ఇక హీరోగానే కాకుండా హోస్ట్​గా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన హోస్ట్​గా ‘అన్​స్టాపబుల్’ షోతో తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. ఇక నటుడిగా సినిమాల్లో తనదైన ముద్ర వేసిన బాలయ్య, రాజకీయాల్లోనూ అదరగొట్టేస్తున్నారు. ప్రజాసేవ చేస్తూ పాలిటిక్స్​లో రానిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ఆయన తల్లిపేరిట “బసవతారకం” ఆసుపత్రి స్థాపించి ఎందరో పేదప్రజలకు అండగా నిలుస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు