HBD Charmy Kaur: నటిగా.. హీరోయిన్ గా.. నిర్మాతగా.. సక్సెస్ఫుల్ జర్నీ..!

HBD Charmy Kaur.. టాలీవుడ్ లో అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్లలో హీరోయిన్ ఛార్మీ కౌర్ కూడా ఒకరు.. ఈ ముద్దుగుమ్మది పంజాబీ అయినప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది..ఛార్మి 13 ఏళ్ల వయసులో నే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఛార్మి చిన్న వయసులోనే హీరోయిన్ గా కూడా అడుగుపెట్టింది. అలా మొదట నీ తోడు కావాలి అంటూ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఛార్మీ.. ఆ తర్వాత శ్రీ ఆంజనేయం, సివంగి తదితర చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. పలు చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది ఛార్మీ. ఇక ఈ రోజు 37వ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి . అందులో భాగంగానే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టిన ఆ తర్వాత నటి గా, హీరోయిన్ గా, నిర్మాతగా ఎలా సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగించింది అనే విషయాల గురించి తెలుసుకుందాం.

ఛార్మీ మొదటి సినిమా..

HBD Charmy Kaur: As an actress.. as a heroine.. as a producer.. a successful journey..!
HBD Charmy Kaur: As an actress.. as a heroine.. as a producer.. a successful journey..!

తమిళంలో కాదల్ కిసుకిసు అనే చిత్రంలో కూడా నటించింది. తన మొదటి సినిమాతోనే తమిళంలో మంచి మార్కులు సంపాదించుకున్న ఛార్మి ఆ తర్వాత రెండు మూడు చిత్రాలలో కూడా నటించింది. తెలుగులో మాత్రం శ్రీ ఆంజనేయం అనే సినిమాతో మొట్టమొదటి విజయాన్ని అందుకుంది.ఇందులో ఛార్మి పాత్రకు మంచి మార్కులు పడడంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు ఇచ్చారు. అలా నాగార్జునతో మాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చక్రం సినిమా, అనుకోకుండా ఒక రోజు ఇలా అద్భుతమైన చిత్రాలను నటించింది ఛార్మీ..

డ్రగ్స్ కేసులో కూడా ఇరుక్కున్న నటి..

ముఖ్యంగా మంగళ సినిమాతో తన నటనకు ఏకంగా నంది అవార్డుని సైతం అందుకుంది చార్మి. మంత్ర సినిమాతో కూడా మరొకసారి మంచి విజయాన్ని అందుకున్న ఛార్మి ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఎంతోమంది యంగ్ హీరోలతో నటించి భార్య పాపులర్ కి దక్కించుకునే అవకాశాలు తగ్గినప్పుడు చివరిగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన జ్యోతిలక్ష్మి సినిమాకి ప్రొడ్యూసర్ గా కూడా మారింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ప్రొడక్షన్లో వరుసగా పలు సినిమాలలో చేస్తోంది ఛార్మి. ఇలాంటి సమయంలోనే పూరి ఛార్మి మీద డ్రగ్స్ కేసు ఆరోపణలు కూడా వినిపించాయి.. అయితే వాటిని నుంచి బయటపడ్డారు.

- Advertisement -

నిర్మాత గా మాత్రం ఫెయిల్యూర్..

చార్మి తన కెరియర్లో పలు సినిమాలలో కూడా స్పెషల్ సాంగులలో కూడా నటించింది. చార్మి అసలు పేరు సర్దీప్ కౌర్.. చార్మి తండ్రి వాస్తు శాస్త్ర నిపుడే కాకుండా.. ఏడు సంవత్సరాలు ముంబైలో డిస్కో డాన్స్ ఛాంపియన్గా కూడా నెగ్గారు.. సినిమాలలో నటించడం కోసం తన అన్నయ్యతో కలిసి ఆడిషన్స్ కి వెళ్ళేది ఈ ముద్దుగుమ్మ. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయి హీరోయిన్గా నటిగా సక్సెస్ అయ్యింది కానీ నిర్మాతగా మాత్రం సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు