HBD Chiranjeevi: 4 దశాబ్దాలలో మెగాస్టార్ ఆస్తి విలువ ఎంతంటే..

HBD Chiranjeevi.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. ఈ పేరు చెబితే చాలు పూనకాలు వచ్చేస్తాయి. తెరపై కనిపిస్తే చాలు పూలు, పేపర్లు ఎగిరి పడతాయి. తన్నులు తిని మరీ చిరంజీవి టికెట్ కోసం పోటీ పడ్డ అభిమానులు ఎంతమంది ఉన్నారో లెక్కల్లో చెప్పలేం. చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినిమాలలోకి వచ్చి ఇప్పుడు స్టార్స్ గా మారిన వారు కూడా చిరంజీవి సినిమా వస్తోందంటే చాలు ఇప్పటికీ థియేటర్లకి వెళ్లి సినిమా చూస్తున్నారు అంటే.. ఆయన పైన ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే కృషి , పట్టుదల ఉంటే అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన చిరంజీవి, ప్రాణం ఖరీదు నుండి పద్మ విభూషణ్ వరకు ఆయన ప్రస్థానం కొనసాగుతోంది. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్నా.. బ్రేక్ డాన్స్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అంచలంచెలుగా ఎదుగుతూ.. సుప్రీం హీరోగా పేరు దక్కించుకొని, ఆ తర్వాత మెగాస్టార్ గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.

HBD Chiranjeevi: What is the value of Megastar's property in 4 decades..?
HBD Chiranjeevi: What is the value of Megastar’s property in 4 decades..?

చిరంజీవి రేంజ్ అలాంటిది..

కమర్షియల్ సినిమాలతో థియేటర్లకు ఊపు తెచ్చిన చిరంజీవి ఇండియన్ తెరపై బ్రేక్ డాన్స్ తో కుర్రాళ్లను ఊగిసలాడించారు. గ్యాంగ్ లీడర్ సక్సెస్ తర్వాత రెమ్యునరేషన్ కోటి రూపాయలు పెంచేసి అమితాబ్ కంటే కూడా ఎక్కువ పారితోషకం తీసుకున్న హీరోగా రికార్డు సృష్టించారు. అంతేకాదు అమితాబ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో అంటూ ఒక ఇంగ్లీష్ కవర్ పేజి పై ఈయన ఫోటో విడుదల చేయడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటారు.

అత్యంత ధనవంతుల జాబితాలో చోటు..

వెంకటేష్, నాగార్జున , బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో పాటు కొనసాగుతూ అందరికంటే ఎక్కువ స్టాండర్డ్ సొంతం చేసుకుని, ఇప్పటి తరం స్టార్ హీరోలకి కూడా పోటీ ఇస్తున్న ఏకైక హీరోగా నిలిచారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ .45 నుండి రూ.50 కోట్ల పారితోషకం తీసుకుంటున్న ఈయన.. దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో చేరిపోయారు. విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు, వ్యాపారాలలో పెట్టుబడులు, ఫారం హౌస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆయన సొంతం. జూబ్లీహిల్స్ లో రోడ్ నెంబర్ 25 లో రూ.100 కోట్ల విలువ చేసే లగ్జరీ హౌస్, ఇక బెంగళూరులో ఫామ్ హౌస్, చెన్నైలో మరో ఇల్లు ఇలా ఎన్నో కలిగి ఉన్నారు.

- Advertisement -

రూ.2,500 కోట్ల పై మాటే..

అంతేకాదు బెంజ్ , రేంజ్ రోవర్, టయోటా హై అండ్ కార్ , ఆడి ఇలా ఎన్నో కార్ కలెక్షన్స్ ఈయన కార్ గ్యారేజీలో మనకు దర్శనం ఇస్తాయి. సినిమాలు, యాడ్స్ అంటూ ప్రతి యేటా కొన్ని కోట్ల రూపాయలను సొంతం చేసుకున్న ఈయన 4దశాబ్దాల కాలంలో ఏకంగా రూ.2500 పైగానే ఆస్తులు కూడబెట్టారు. అంతేకాదు కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే భూములను తన సోదరీమణులకు రాఖీ సందర్భంగా ఇచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇకపోతే ఈరోజు చిరంజీవి పుట్టిన రోజు ఆయన 69వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు . ఈ సందర్భంగా అటు సెలబ్రిటీలు ఇటు అభిమానులు చిరంజీవికి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు