HBD Gopichand : తరగని మాస్ క్రేజ్.. ‘మ్యాచో స్టార్’ సొంతం…

HBD Gopichand : తెలుగు చిత్ర పరిశ్రమలో నేటితరం హీరోల్లో మాస్ హీరో అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా, ఆరడుగుల బులెట్ లా పర్ఫెక్ట్ కటౌట్ లా నిలిచే హీరో “గోపీచంద్”. మ్యాచో స్టార్ గా అభిమానుల చేత పిలిపించుకునే ఈ మాస్ హీరో స్క్రీన్ పై కనబడితే ఆ కటౌట్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇంటెన్స్ లుక్ తో గంభీరమైన గొంతు తో చెప్పే ఒక్కో పవర్ ఫుల్ డైలాగులకు ఎవరైనా పడిపోతారు. ఎదురుగా ఎంత పెద్ద విలన్ ఉన్నా వాళ్ళకి ఎదురెళితే తలదన్నేలా ఉంటుంది గోపీచంద్ స్క్రీన్ ప్రెజెన్స్. తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టి రెండు దశాబ్దాలపైనే అయినా, పదేళ్లుగా ప్లాప్ లు అందుకుంటున్నా, చెక్కు చెదరని అభిమానం మ్యాచో స్టార్ సొంతం. ఇప్పటికి ఆ కటౌట్ కి తగ్గ మాస్ సినిమా పడితే బాక్స్ ఆఫీస్ వద్ద జాతరే. అలాంటి మాస్ క్రేజ్ ఉన్న మ్యాచో స్టార్ “గోపీచంద్” (HBD Gopichand) పుట్టినరోజు (జూన్12) నేడు. ఈ సందర్బంగా గోపీచంద్ కి ఫిల్మీ ఫై తరపున బర్త్ డే విషెస్ ని అందచేస్తూ, ఆయన ఫిల్మ్ జర్నీ పై ఓ లుక్కేద్దాం.

HBD Gopichand Birth Day Special

విలన్ గా ఎదిగి హీరోగా మాస్ క్రేజ్…

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విప్లవాత్మక చిత్రాల విలక్షణ దర్శకుడు టి. కృష్ణ తనయుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు “తొట్టెంపూడి గోపిచంద్”. అలా తొలి సినిమా ‘తొలివలపు’ తో నటుడిగా ప్రశంసలు కొట్టేసిన ప్లాప్ అందుకుని చేదు రుచి చూసాడు. అయినా ఒకసారి బరిలోకి దిగితే వెనుతిరిగే ప్రసక్తే లేదు అన్నది గోపీచంద్ నైజం. అందుకే గోపీచంద్ వచ్చిన అవకాశాలతో సాగాలని నిర్ణయించుకుని, ముందుగా ప్రతినాయకుడిగా నటించాడు. వరుసగా “జయం”, “నిజం”, “వర్షం” వంటి చిత్రాలలో ప్రతినాయకునిగా మెప్పించాడు. ఆ సినిమాల్లో గోపీచంద్ నటన మామూలుగా ఉండదు. జయం, నిజం సినిమాల్లో గోపీచంద్ నటనకు ఎవరైనా భయపడాల్సిందే అన్నట్టుంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాల ద్వారా హీరోల కంటే విలన్ గా నటించిన గోపీచంద్ కే ఎక్కువ పేరు వచ్చింది.

- Advertisement -

యజ్ఞం తో అసలైన జర్నీ..

ఇక ఆ సినిమాల తర్వాత గోపీచంద్ మళ్ళీ కథానాయకునిగా కదం తొక్కాలనే తపించారు. ఆ ప్రయత్నంలో గోపీచంద్ తండ్రి టి.కృష్ణకు అత్యంత సన్నిహితుడైన పోకూరి బాబూరావు నిర్మించిన ‘యజ్ఞం’ ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఎ.యస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో గోపీచంద్ కోరుకున్న సూపర్ హిట్ లభించింది. ఆ తర్వాత “ఆంధ్రుడు” సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన గోపీచంద్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక అప్పటి నుండి వెనుదిరికి చూసుకోలేదు గోపి. వరుసగా గోపీచంద్ యజ్ఞం, ఆంధ్రుడు, రణం సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని స్టార్ హీరోగా బిజీ అయ్యాడు. ఇక ఆ తర్వాత లక్ష్యం, శౌర్యం, శంఖం, గోలీమార్ వంటి హిట్ సినిమాలు గోపీచంద్ క్రేజ్ ని రెట్టింపు చేసాయి. ఆపై వరుస పరాజయాలు పలకరించడంతో పట్టువదలని విక్రమార్కునిలా గోపీచంద్ సాగారు. ఆ సమయంలో ‘లౌక్యం’ గోపీచంద్ కు ఊరటనిచ్చింది. ‘లౌక్యం’ తరువాత వచ్చిన ‘జిల్’, సీటిమార్, వంటి సినిమాలు జనాల్ని ఆకట్టుకున్నా, యావరేజ్ ఫలితాన్ని అందుకున్నాయి.

విలక్షణ నటనకు మారుపేరు…

ఇక గోపీచంద్ కెరీర్ బిగినింగ్ లోనే విలన్ గా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. జయం, నిజం లాంటి సినిమాల్లో అద్భుత నటనతో మెప్పించిన గోపీచంద్, టాలీవుడ్ లో పలు ప్రయోగాత్మక చిత్రాలు చేసారు. ఒక్కడున్నాడు, సాహసం వంటి చిత్రాలతో తనలోని వైవిధ్యాన్ని చూపిన గోపీచంద్, ఆ మధ్య గౌతమ్ నంద సినిమాతో అద్భుతమైన నటనతో అభిమానులని ఏ రేంజ్ లో మెప్పించాడో తెలిసిందే. ఇక ఈ ఇయర్ భీమా తో మరో ప్లాప్ అందుకున్నా, గోపీచంద్ కి మాస్ లో ఉన్న క్రేజ్ ఏంటో భీమా కలెక్షన్లు నిరూపించాయి. అందుకే గోపీచంద్ ఫ్యాన్స్ కి నిఖార్సైన సినిమా అందించడానికి ఎంతో ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం శ్రీనువైట్ల డైరెక్షన్ లో విశ్వం సినిమా చేస్తున్న గోపీచంద్ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. మరి “విశ్వం” సినిమాతో మ్యాచొ స్టార్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు