HBD GunaSekhar : భారీ హంగులకు కేరాఫ్ గుణశేఖర్..ఆనాటి గుణ ని మళ్ళీ చూడాలి!

HBD GunaSekhar : టాలీవుడ్ లో ఒకప్పుడు భారీ చిత్రాలు తెరకెక్కిస్తూ, బాక్స్ ఆఫీస్ పై భారీ విజయాలు సాధించిన డైరెక్టర్ “గుణ శేఖర్”. భారీ తరానికి కేరాఫ్ గా, సినిమాలో సెట్టింగులతో మరో ప్రపంచాన్ని తలపించే దర్శకుడీయన. ఒకప్పుడు గుణ శేఖర్ సినిమాల్లో హీరోలు కామన్ గా ఉండే టైం వచ్చినప్పుడు సత్తా చూపిస్తారు. అసలు గుణశేఖర్ అంటేనే భరితనంతో కూడిన కథా, కథనాలు సెట్టింగులతో కూడి ఉంటుంది. సినిమాపై ఉన్న ప్యాషన్‌తో తను చేసే ప్రతి సినిమాను అద్భుతంగా మలిచే అతి తక్కువ మంది దర్శకుల్లో ఒకరు గుణశేఖర్. ఒక చూడాలని ఉంది, ఒక ఒక్కడు… ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ లో రికార్డులు తిరగరాసిన చిత్రాలు గుంజా శేఖర్ దర్శకత్వం వహించాడంటే ఇప్పటి ఆడియన్స్ నమ్మలేరు. అలాంటి చిత్రాలు తీసిన గుణ శేఖర్ గత కొంతకాలంగా ఫామ్ లో లేడు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా పాన్ ఇండియా సినిమాలే తీస్తూ, సెన్సేషన్‌ క్రియేట్‌ చేయడానికి సిద్ధమవుతోన్న అన్‌కాంప్రమైజ్డ్‌ స్టైలిష్‌ డైరెక్టర్ గుణశేఖర్‌ (HBD GunaSekhar) పుట్టినరోజు (జూన్‌ 2) ఈ రోజు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ ని అందచేస్తూ గుణ శేఖర్ ఫిల్మ్ జర్నీ పై ఓ లుక్కేద్దాం..

HBD GunaSekhar Birth day special

భారీతనానికి కేరాఫ్ గుణశేఖర్..

టాలీవుడ్ లో గుణశేఖర్‌ సినిమా అంటే.. ఓ వైపు భారీతనం, డిఫరెంట్‌ కథ, కథనాలతో పాటు.. వైవిధ్యమైన పాత్రలతో సినిమాలు చేసి ప్రేక్షకులు ఊహించిన దాని కంటే మరో మెట్టు పైనే సినిమాలను రూపొందించిన దర్శకుడాయన. అప్పుడెప్పుడో తీసిన తొలి చిత్రం ‘లాఠీ’ నుంచి నిన్నటి శాకుంతలం వరకు గుణశేఖర్‌ మేకింగ్‌ స్టైలే భిన్నంగా ఉంటుంది. అదే ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు తీసే ఈ దర్శకుడు తన తొలి చిత్రంతోనే మూడు నంది అవార్డులను సొంతం చేసుకుని టాలీవుడ్ ని ఆకర్షించాడు. ఆ తర్వాత ‘సొగసు చూడతరమా’, అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో ‘బాల రామాయణం’ చిత్రాలతో దర్శకుడిగా తన మార్క్‌ క్రియేట్‌ చేసుకున్నారు గుణశేఖర్‌. కానీ గుణ శేఖర్ లోనే అసలైన దర్శకుడ్ని పరిచయం చేసి స్టార్ డైరెక్టర్ గా మలిచింది మెగాస్టార్ చిరంజీవి సినిమానే. 1998 లో మెగాస్టార్‌ చిరంజీవితో ‘చూడాలని ఉంది’ సినిమా చేసే అవకాశం దక్కించుకున్న గుణశేఖర్‌, చిరంజీవిని సరికొత్త కోణంలో ప్రెజెంట్‌ చేశారు. ఆ రోజుల్లో ఈ సినిమా పాటలు విడుదలకు ముందు వేలల్లో అమ్ముడుపోగా, ఈ సినిమా కోసం వేసిన కోల్‌కతా సెట్ అప్పట్లో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ కి దగ్గరగా వచ్చి ఆగిపోయింది.

- Advertisement -

‘ఒక్కడు’తో సెన్సేషన్‌..

ఇక చిరు గుణశేఖర్ కాంబోలో రెండో సారి రూపొందిన ‘మృగరాజు’ ప్రేక్ష‌కుల‌కు ఒక డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌ ని ఇచ్చింది. ఆ తర్వాత జగపతి బాబు, లయ ప్రధాన పాత్రల్లో రూపొందించిన ‘మనోహరం’ కూడా మంచి హిట్‌ గా నిలిచింది. ఇక ప్రిన్స్ మహేష్ బాబుతో మూడు సినిమాలను తెరకెక్కించిన దర్శకుడిగా గుణశేఖర్‌కి ఓ రికార్డ్‌ ఉంది. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ‘ఒక్కడు’ సినిమా. కబడ్డీ ప్లేయర్‌గా, మహేష్‌ను గుణశేఖర్ పోట్రేట్‌ చేసిన తీరు అద్భుతం. ఈ సినిమాతోనే మహేష్ స్టార్ హీరో అయ్యాడు. ఇక ఈ సినిమా కోసం గుణశేఖర్‌ వేయించిన చార్మినార్‌ సెట్‌ ని అది సెట్ అని చాలా మంది నమ్మలేరు. ఇప్పటికీ వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ సెట్‌గా చెప్పుకుంటారంటే అతిశయోక్తి కాదు. తర్వాత మహేష్ తోనే ‘అర్జున్‌’ ‘సైనికుడు’ చిత్రాలతో మెప్పించాడు. ఆ సినిమాలు అంతగా ఆడకపోయినా దర్శకుడుగా ప్రేక్షకుల మెప్పు పొందాడు గుణశేఖర్. ఇక “రుద్రమదేవి” అంటూ చారిత్రాత్మక చిత్రంతో మళ్ళీ మెప్పించాడు గుణ. తెలుగులో రూపొందిన తొలి హిస్టారికల్‌ స్టీరియో స్కోపిక్‌ త్రీడీ మూవీ ఇది.

మళ్ళీ ఆ నాటి గుణ ని చూడగలమా?

అయితే తెలుగులో ఎంతో పేరున్న దర్శకుడు గుణ శేఖర్ అప్పటి రేంజ్ లో మాత్రం ఇప్పుడు సినిమాలు చేయలేకపోతున్నాడు. మొన్నామధ్య శాకుంతలం చిత్రంతో మళ్ళీ దారుణమైన పరాజయాన్ని అందుకున్నాడు. అయినా తనలోని దర్శకుడిని మరింత పదునెక్కిస్తున్నాడు. త్వరలో భారీ బడ్జెట్‌తో ‘హిరణ్య’ అనే పౌరాణిక చిత్రాన్ని రూపొందించనున్నారు. రానా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించబోతున్నాడు. అలాగే తన సొంత నిర్మాణ దర్శకత్వంలో ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై నీలిమ గుణ నిర్మాత‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. సినిమాలో న‌టించబోయే న‌టీన‌టులు, ఇత‌ర టెక్నిషియన్స్‌కు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.మరి ఈ సినిమాతో గుణశేఖర్ దర్శకుడిగా బ్యాక్ బౌన్స్ అవుతారా లేదా అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు