HBD Ilayaraja : మాస్ట్రో ఇళయరాజా బర్త్ డే ఈ రోజే.. కానీ ఒకరోజు ముందే సెలెబ్రేషన్స్ ఎందుకంటే?

HBD Ilayaraja : “ఇళయరాజా”.. ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండరేమో. దక్షిణ భారత చలన చిత్ర సీమలో సంగీత జ్ఞాని గా, ఇసైజ్ఞాని గా, మాస్ట్రో గా.. ఇలా రకరకాల పేర్లతో సినీ సంగీత ప్రపంచాన్ని నాలుగు దశాబ్దాలుగా ఏలుతున్న మహా సంచలనం ఇళయరాజా. ఈయన సంగీత ప్రతిభకు ఎంత పొడిగినా సమయం చాలదు. సంగీత సముద్రంలో అలలా వచ్చి పడిన మెరుపు ఆయన. ఆయనే ఓ సంగీత సముద్రం. తరగని చెరగని బాణీల సృష్టికర్త ‘ఇళయరాజా’. భారతీయ సంగీతానికి, వెస్ట్రన్ బీట్స్ జోడించి, సరికొత్త సరిగమలు సృష్టించిన జ్ఞాని ఈయన.

ఆయన సృష్టించిన గీతాల్లో వందల క్లాసిక్స్ ఉన్నాయి. ఇప్పటితరాన్ని కూడా ఉర్రూతలూగించే ఎన్నో మధురమైన పాటలిచ్చారాయన. ఇంతటి ఘన చరిత్ర ఉన్న మాస్ట్రో ఇళయరాజా (HBD Ilayaraja) పుట్టినరోజు (జూన్ 3) ఈరోజే కావడం విశేషం. అయితే చాలా మంది ఆయన పుట్టిన రోజు జూన్ 2 కదా అనే అనుకుంటారు. ఇళయరాజా పుట్టిన రోజు కూడా అభిమానులు రెండో తారీఖుని సెలెబ్రేట్ చేస్తారు. ఇళయరాజా కూడా జూన్ రెండునే పుట్టిన రోజుగా చెప్పుకుంటారు. కానీ నిజానికి ఇళయరాజా బర్త్ డే జూన్ 3. కానీ దానికన్నా ఒకరోజు ముందే సెలెబ్రేట్ చేసుకోవడానికి ఒక కారణం ఉంది.

HBD Ilayaraja's birthday is on 3rd June. But because of the celebrations a day earlier?
HBD Ilayaraja’s birthday is on 3rd June. But because of the celebrations a day earlier?

ఇళయరాజా బర్త్ డే ముందు రోజు జరుపుకోడానికి కారణమిదే!

ఇక మాస్ట్రో ఇళయరాజా తన పుట్టినరోజు జూన్ 2 నే జరుపుకున్నారు. కానీ జూన్ 3న పుట్టిన ఆయన ఒకరోజు ముందే తన బర్త్ డే ని జరుపుకోవడానికి స్ట్రాంగ్ రీసన్ ఉందట. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా… తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, రచయిత కరుణానిధి అంటే ఎంతో అభిమానం. అయితే కరుణానిధి పుట్టినరోజు కూడా జూన్ 3నే కావడం విశేషం. అందుకే ఆయన మీద గౌరవంతో ఇళయరాజా ఒకరోజు ముందే తన పుట్టినరోజును జూన్ 2న జరుపుకోవడం మొదలు పెట్టారట. ఇక ఇళయరాజా కి ఉన్న “ఇసై జ్ఞాని” బిరుదుని కూడా కరుణానిధియే ఇచ్చి సత్కరించారు. ఇలా ఆయన మీద ఉన్న అభిమానంతోనే ఒకరోజు ముందు ఇళయరాజా పుట్టినరోజు జరుపుకుంటారని సమాచారం. ఇక ఇళయరాజా ప్రస్తుతం నాలుగు సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ, ఇప్పటికీ బిజీగా ఉన్నారు.

- Advertisement -

మాస్ట్రో బయోపిక్ అతి త్వరలో..

ఇక ఇళయరాజా తమిళనాడుకి చెందిన వాడైనా, దేశం నలుమూలలా ఈయన సంగీతానికి చెవికోసుకునే అభిమానులుంటారు. ఏకంగా ఆరువేలకి పైగా పాటలనందించిన మాస్ట్రో ఇళయరాజా ఇప్పటికి సినిమాలకు సంగీతం అందిస్తూనే ఉన్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు, మరాఠీ, హిందీ చిత్రాలకు కూడా ఆయన మ్యూజిక్ అందించారు. ఇక ప్రస్తుతం మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ ధనుష్ ఇందులో హీరోగా నటిస్తుండగా, అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. విశేషమేమిటంటే, తన బయోపిక్ కి ఇళయరాజానే మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు