HBD JR NTR : ‘విశ్వామిత్ర టు RRR’ వరకు… వెండితెరపై తనని తానే ఆవిష్కరించుకున్న నందమూరి చిన్నోడు…

HBD JR NTR : నందమూరి నట వారసుడిగా మూడో తరంవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చిన్న వయసులోనే చిత్ర పరిశ్రమలో అగ్రనటుడిగా స్థానం సంపాదించి తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు “జూనియర్ ఎన్టీఆర్”. నందమూరి వారసత్వంతో అడుగుపెట్టినా, అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని నేడు నందమూరి వంశానికే భవిష్యత్తుగా మారాడు. సినిమాలో అనర్గళంగా ఒక డైలాగ్ చెప్పాలన్నా, సింగల్ టేక్ స్టెప్పన్నా, ఏ భావాన్నైనా పలికించాలన్నా, ఈ తరంలో ముందు గుర్తొచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్. బాల నటుడిగా నందమూరి తారకరామారావు ఆశీస్సులతో ఆయన సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదిగి అప్రతిహతంగా తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ఈరోజు ఈ నందమూరి చిన్నోడి (మే20) పుట్టినరోజు. ఈ సందర్బంగా ఫిల్మీ ఫై తరపున బర్త్ డే విషెస్ అందచేస్తూ ఎన్టీఆర్ సినీ ప్రయాణంపై ఓ లుక్కేద్దాం…

నూనూగు మీసాల వయసులో అగ్రనటుడుగా గుర్తింపు…

నందమూరి తారకరామారావు ఆశీస్సులతో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన JR ఎన్టీఆర్, తొలిసినిమాతోనే తాతయ్య తో కలిసి 1991లోనే “బ్రహ్మర్షి విశ్వామిత్ర” సినిమాలో నటించాడు. ఆ తరువాత గుణ శేఖర్ తీసిన బాల రామాయణంలో బాల నటుడుగా రాముడి పాత్రలో మెప్పించాడు. ఇక కేవలం పదిహేడో ఏటనే సినీ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. తొలి సినిమా “నిన్ను చూడాలని” సినిమాతో లెజెండరీ దర్శక నటులతో పనిచేసాడు ఎన్టీఆర్. కానీ ఆ సినిమా దారుణంగా బెడిసికొట్టేసింది. తొలి చిత్రం దెబ్బ కొట్టినా, మలిచిత్రంతో అంతకు మించి ఎగిసిపడ్డాడు. రాజమౌళి తొలిచిత్రం స్టూడెంట్ నెంబర్ 1 తో మంచి హిట్టు కొట్టగా, వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆది’ తో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక రాజమౌళి తో చేసిన సింహాద్రి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆది, సింహాద్రికి మధ్యలో సుబ్బు, అల్లరిరాముడు, నాగ వంటి పరాజయాలు వచ్చినా, సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూపించేసి, లెక్కలు సెట్ చేసాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తిరుగులేని కలెక్షన్లను సంపాదించి, నాన్ ఇంద్ర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 8 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఆ రోజుల్లోనే దాదాపు 26 కోట్ల షేర్ రాబట్టింది. ఇక సింహాద్రితో ఎన్టీఆర్ క్రేజ్ ఆకాశన్నంటింది. నందమూరి వంశానికి అసలు సిసలు వారసుడు వచ్చాడని భావించారు.

HBD JR NTR Birth Day Special

- Advertisement -

చెక్కు చెదరని అభిమానం..

ఇక సింహాద్రి తర్వాత పూరి జగన్నాథ్ తో ఆంధ్రావాలా తీయగా, ఈ సినిమా ఆడియో ఫంక్షన్ గురించి తెలిసిందేగా. ఈ ఫంక్షన్‌కు హాజరైన జనం, దాని విజువల్స్ ఇప్పటికీ ఎప్పటికీ ఓ రికార్డే. ఆ రేంజ్ లో ఈవెంట్ జరుగుతుందని ఎవ్వరూ ఊహించరు. అయితే ఆంధ్రావాలా సినిమా దారుణమైన పరాజయాన్ని చవి చూసింది. ఆ తరువాత సాంబ పర్వాలేదనిపించగా, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ డిజాస్టర్లతో దారుణంగా దెబ్బ పడింది. కాని ఆ తర్వాత రాఖీ, యమదొంగ చిత్రాలతో ఎన్టీఆర్ నటనాస్థాయితో మరో మెట్టు ఎక్కేసాడు. అదే సమయంలో 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున ప్రచారం, రోడ్డు ప్రమాదం జరిగి తృటిలో గాయాలతో బయటపడ్డాడు. అందుకే కాస్త గ్యాప్ తీసుకునే వెంటనే అదుర్స్, బృందావనం వంటి చిత్రాలతో సక్సెస్ బాట పట్టాడు. అంతా బాగానే ఉందని అనుకునే సమయంలో, శక్తి ,ఊసరవెల్లి, దమ్ము, రామయ్య వస్తావయ్యా, రభస సినిమాల ప్లాప్ లతో ఎన్టీఆర్ డల్ అయ్యాడు. మధ్యలో బాద్ షా కాస్త మెప్పించింది.

ఎన్టీఆర్ 2.0..

ఇక అప్పుడే ఎన్టీఆర్ స్క్రిప్ట్ సెలెక్షన్లలో పక్కా ప్లానింగ్ తో చెంజోవర్ అయ్యాడు. అప్పుడు పూరి జగన్నాథ్ తో చేసిన “టెంపర్” సినిమా ఎన్టీఆర్ సినీ కెరీర్‌ను మరో మలుపు తిప్పింది. అంత వరకు చూడని కొత్త ఎన్టీఆర్‌ను పూరి జగన్నాథ్ మళ్ళీ చూపించాడు. ఆ తర్వాత వరుసగా నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, RRR సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ సక్సెస్ ని అందుకుని సత్తా చాటాడు. ప్రతి సినిమాకి తనలోని వేరియషన్స్ ని డిఫరెంట్ గా చూపిస్తూ, హిట్ల మీద హిట్లు కొడుతున్న ఎన్టీఆర్ (HBD JR NTR) త్వరలో “దేవర” సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా తన సత్తా చాటి బాక్స్ ఆఫీస్ రికార్డుల తిరగరాయాలని చూస్తున్నాడు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు