HBD Karthi : విలక్షణమైన నటనకు మారుపేరు కార్తీ.. ‘పరుత్తి వీరన్’ నుండి ‘జపాన్’ వరకు ‘కార్తీ’ సినీ ప్రయాణం..

HBD Karthi : “కార్తీ”.. ఈ పేరు గురించి సినీ ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పేరుకు త‌మిళ హీరోనే అయినా తెలుగు హీరో అనే స్థాయిలో ఇక్కడ అభిమానులని సంపాదించాడు. తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులో తన అద్భుత నటనతో, అలాగే తన మంచి వ్యక్తిత్వంతో చోటు సంపాదించుకున్నారు. సూర్య తమ్ముడిగా పరిచయమైనా కార్తీ తెలుగు, తమిళ భాషల్లో ప్రత్యేకంగా సొంత అభిమానులని సంపాదించుకున్నాడు. త‌న‌దైన స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో విలక్షణ పాత్రలతో అభిమానుల‌ను మెప్పిస్తున్న కార్తీ తమిళ్ తో సమానంగా తెలుగులో అభిమానులని సంపాదించుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఓ దశలో తెలుగులో అన్నయ్య సూర్య కంటే ఎక్కువ ఫాన్స్ ని సంపాదించారని చెప్పొచ్చు. ఇక నేడు “కార్తీ” (HBD Karthi) పుట్టిన రోజు (మే 25) సందర్బంగా తనకి Filmify టీమ్ తరపున ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ ని అందచేస్తూ, కార్తీ సినీ ప్రయాణం పై ఓ లుక్కేద్దాం.

HBD Karthi Birth Day Special Story

అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలై హీరోగా…

సూర్య తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీ కి పరిచయమైనప్పటికీ కార్తీ అంతకు ముందే పలు సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారని చాలా మందికి తెలీదు. లెజెండరీ దర్శకుడు మ‌ణిర‌త్నం ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెరీర్ మొద‌లు పెట్టాడు కార్తీ. అన్న సూర్య హీరోగా మణిరత్నం దర్శకత్వంలో నటించిన “యువ‌” అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టాడు కార్తీ. అలాగే ఈ సినిమాతోనే వెండి తెరపై ఓ సీన్ లో తొలిసారి ప్రేక్షకులకు క‌నిపించాడు కార్తీ. అయితే మణిరత్నం తనలోని టాలెంట్ ని గమనించి సినిమాల్లో హీరోగా ట్రై చేయమన్నారు. కానీ ముందుగా దర్శకుడిగానే రాణించాలనుకున్న కార్తీ అనుకోకుండా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక తొలిసారి హీరోగా 2007లో వచ్చిన “పరుత్తి వీరన్” చిత్రంతో హీరోగా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కార్తీ.

- Advertisement -

‘పరుత్తి వీరన్’ నుండి ‘జపాన్’ దాకా ఎన్నో విలక్షణ పాత్రలు..

ఇక కార్తీ మొదటి సినిమా నుండే నటనకు స్కోప్ ఉండే పాత్రలో, డీ గ్లామరైజ్ పాత్రను పోషించారు. “పరుత్తి వీరన్” తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తీ ఆ సినిమాతో నటుడుగా పేరు సంపాదించుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఆ తర్వాత “యుగానికి ఒక్కడు” సినిమాతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా పరిచయమయ్యాడు. ఇక ఆ సినిమాతో సౌత్ మొత్తం పాపులర్ అయ్యాడు. యుగానికొక్క‌డులో వైవిధ్య‌మైన పాత్ర‌లో కార్తీ నటించగా, ఆ సినిమా తమిళ్ కంటే తెలుగులో బాగా ఆడడం విశేషం. ఇక ఆ తర్వాత “ఆవారా” సినిమాతో కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని, అక్కడి నుండి తన ప్రతి సినిమా కూడా తెలుగులో రిలీజ్ చేస్తూ వచ్చాడు. ఆ తరవాత “నా పేరు శివ‌”, శకుని, “ఖాకి” వంటి చిత్రాల‌తో స‌హ‌జ న‌ట‌న‌కు కేరాఫ్‌గా మారారు కార్తీ. ఇక నాగార్జునతో “ఊపిరి” చిత్రంలో న‌టించిన కార్తీ తెలుగు వారికి మ‌రింత చేరువయ్యాడు. ఇక్కడ మరింత స్ట్రాంగ్ మార్కెట్ ను సంపాదించుకున్నాడు.

ఖైదీ తో కార్తీ 2.0..

ఇక వరుస సినిమాలతో దూసుకుపోతున్న కార్తీ లోకేష్ కానగరాజ్ తో చేసిన “ఖైదీ” సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకోగా, ఆ సినిమా ఏకంగా 150 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ఢిల్లీ పాత్రలో కార్తీ పండించిన ఎమోషన్స్, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక త్వరలో ఈ సినిమాకే సీక్వెల్ కూడా రానుంది. ఆ తర్వాత సుల్తాన్, సర్దార్, పొన్నియిన్ సెల్వన్ వంటి భారీ విజయాలతో దూసుకుపోతున్నాడు కార్తీ. రీసెంట్ గా జపాన్ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన కార్తీ త్వరలో మూడు క్రేజీ ప్రాజెక్టులతో ముందుకు రానున్నాడు. అందులో ఖైది2 కూడా ఒకటి. ఇక తాజాగా కార్తీ బర్త్ డే (HBD Karthi) స్పెషల్ గా ‘మైయాఘగన్’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ముందు ముందు కార్తీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేయబోతున్నాడని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు