HBD Kiran Abbavaram: పెళ్లి డేట్ ఫిక్స్.. అలాంటి వీడియో షేర్ చేసిన కాబోయే భార్య..!

HBD Kiran Abbavaram..టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంతంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ఫుల్ హీరోగా పేరు సంపాదించారు. బడా బ్యానర్లలో సినిమాలు తెరకెక్కించిన ఈయన కెరియర్ లో సక్సెస్ ల కంటే ఫ్లాప్ లే ఎక్కువగా ఉంటాయి. అయినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ” క “అనే ఒక సినిమాలో నటిస్తున్నారు.. ఇదంతా పక్కన పెడితే ఈ రోజున కిరణ్ అబ్బవరం బర్తడే..ఈ సందర్భంగా అభిమానులు సైతం ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. అలాగే సినీ ప్రముఖులు కూడా బర్తడే విషెస్ తెలుపుతున్నారు. ఇప్పుడు ఈయన కాబోయే భార్య పెళ్లి డేట్ ని ఫిక్స్ చేస్తూ చేసిన పోస్టు వైరల్ గా మారుతుంది..

HBD Kiran Abbavaram: Wedding date fix.. Such a video was shared by fiancee..!
HBD Kiran Abbavaram: Wedding date fix.. Such a video was shared by fiancee..!

హీరోయిన్ రహస్య తో కిరణ్ ఎంగేజ్మెంట్..

గడచిన కొద్ది రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్ రహస్య గోరఖ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కిరణ్ అబ్బవరం అయితే ఈరోజు కిరణ్ అబ్బవరం బర్తడే సందర్భంగా ఒక లవ్లీ వీడియోని షేర్ చేస్తూ తన ప్రేమను చాటుకుంది రహస్య గోరఖ్ . అలాగే ఈ వీడియోలో తమ పెళ్లి డేట్ ని కూడా రివీల్ చేసినట్లుగా తెలుస్తోంది.. ఇందులో తన ప్రియుడు కిరణ్ ని భర్త అని పిలిచేందుకు ఆగలేక పోతున్నాను.. కేవలం 38 రోజులు మాత్రమే సమయం ఉందంటూ రాసుకొచ్చింది రహస్య గోరఖ్.. వీరిద్దరి కాంబినేషన్లో మొదట రాజు వారు రాణి వారు సినిమా వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

పెళ్లి డేట్ ఫిక్స్..

ఆ తర్వాత ఎన్నో ఫంక్షన్లలో కూడా వీరిద్దరూ కలిసి కనిపించారు. అంతేకాకుండా కిరణ్ అబ్బవరం ఇంట్లో జరిగే ఎటువంటి శుభకార్యాలలో అయినా ఈమె కనిపించడం జరిగింది. ఆగస్టు 22వ తేదీన ఈ ఏడాది వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా కిరణ్ , రహస్య గోరఖ్ కు సంబంధించిన ఈ రొమాంటిక్ అండ్ లవ్లీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది. ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్స్ సైతం కిరణ్ అబ్బవరానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

- Advertisement -

సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మారిన రహస్య..

అలాగే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ కావడంతో ముందుగానే ఈ దంపతులకు.. పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఏడాది మార్చిలో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ జంట.. అదే నెలలోనే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.. ఇప్పుడు మళ్లీ పెళ్లితో తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లే విధంగా ఈ జంట ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. అయితే హీరోయిన్ రహస్య గోరఖ్ మాత్రం కేవలం రాజా వారు రాణి వారు సినిమా లో నటించి తన కెరీయర్ని ఆపివేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా యంగ్ హీరో పెళ్లి తేది చెప్పకనే చెప్పేశారని చెప్పవచ్చు. మొత్తానికి అయితే మరో 38 రోజుల్లో ఈ జంట పెళ్లి పీటలెక్కబోతోందని సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Rahasya (@rahasya_gorak)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు