HBD Mokshagna.. నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna ) వారసుడి సినీ ఎంట్రీ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూసిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు కనీసం ఈ రోజైనా ఆయన మూవీకి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందా అంటూ అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. మరి అభిమానుల ఎదురీతకు పులిస్టాప్ పెడుతూ చిత్ర బృందం అదిరిపోయే పోస్టర్ విడుదల చేసింది.
ఇండస్ట్రీలోకి రాబోతున్న వారసుడు..
తాజాగా మోక్షజ్ఞ మొదటి మూవీ ఈరోజు లాంచ్ కాబోతోందని, గత వారం రోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇక ఎట్టకేలకు ఈరోజు చిత్ర బృందం మోక్షజ్ఞ (Mokshagna) కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి ఈ సందర్భంగా చాలా స్టైలిష్ వాక్ లో చాలా అందంగా మోక్షజ్ఞ కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకప్పుడు మోక్షజ్ఞ చాలా బొద్దుగా , పొట్టిగా కనిపించి, అసలు ఇతడు ఇండస్ట్రీలోకి హీరోగా వస్తే ఈయనను ఎవరు చూస్తారు అంటూ చాలామంది హేళన చేశారు.
మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ అదుర్స్..
ఈమధ్య ఎన్నికల సమయంలో తన బామ్మను తీసుకొని ఓటింగ్ కి వెళ్ళినప్పుడు కాస్త సన్నబడినట్టు కనిపించారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి చాలా స్టైలిష్ గా, హ్యాండ్సం లుక్ లో కనిపించేసరికి అమ్మాయిలు సైతం ఫిదా అయిపోతున్నారు. కొత్త హీరో లుక్ అదుర్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అటు సినీ సెలబ్రిటీలు ఇటు అభిమానులు కూడా మోక్షజ్ఞ లుక్ ని చూసి సంతోషం వ్యక్తం చేయడమే కాదు మోక్షజ్ఞ ఫోటోలు షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. ఇక మోక్షజ్ఞను ఇలా చూడడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
సింబా ఈజ్ కమింగ్..
ఇక మోక్షజ్ఞ మొదటి మూవీ అప్డేట్ విషయానికి వస్తే.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య కుమారుడు మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఒక పోస్ట్ కూడా పెట్టారు. “సింబా ఈజ్ కమింగ్” అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్ ను విడుదల చేశారు . దీంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. తొలి సినిమాకు ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోకి మోక్షజ్ఞ..
ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వరుస పోస్టులతో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అభిమానులకు హింట్ ఇస్తూ వస్తున్న విషయం తెలిసిందే. నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఒక కొత్త తేజస్సు రానుంది. వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నేను మరింత ఉత్సాహంగా ఉన్నాను. ఇది ఒక అద్భుతమైన క్షణం అంటూ వరుస పోస్టు పెడుతున్నారు ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు తాజాగా మోక్షజ్ఞ లుక్ ను పంచుకొని తన తరువాత సినిమా హీరో ఇతడే అంటూ బాలయ్య వారసుడిని పరిచయం చేశారు ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రెండో ప్రాజెక్టుగా రానున్న సినిమాలో మోక్షజ్ఞ హీరో కావడం విశేషం. మొత్తానికైతే మోక్షజ్ఞ లుక్ అదుర్స్ అని చెప్పవచ్చు. మరి కొంతమంది అభిమానులు యంగ్ బాలకృష్ణ వచ్చాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
With great joy & privilege, Introducing you…
“NANDAMURI TARAKA RAMA MOKSHAGNYA TEJA” 🦁
Happy birthday Mokshu 🥳
Welcome to @ThePVCU 🤗
Let’s do it 🤞Thanks to #NandamuriBalakrishna Garu for all the trust & blessings 🙏
Hoping to make this one much more special &… pic.twitter.com/gm9jnhOvYx
— Prasanth Varma (@PrasanthVarma) September 6, 2024