HBD Nagarjuna: ఆ రికార్డు నాగ్ కే సొంతమా.. ఇదిగో ప్రూఫ్..!

HBD Nagarjuna.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswar Rao) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నాగార్జున (Nagarjuna). ముఖ్యంగా నవమన్మధుడిగా కింగ్ నాగార్జున గా, రొమాంటిక్ హీరోగా కూడా పేరు తెచ్చుకున్న ఈయన హీరోగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఏ జానర్ లో అయినా సరే సినిమా చేయగల సత్తా కలిగిన హీరోగా పేరు దక్కించుకున్నారు నాగార్జున. ముఖ్యంగా ఎంతో మంది హీరోయిన్లతో ఎఫైర్ కూడా నడిపాడు అనే వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇదిలా ఉండగా ఈయన బాలీవుడ్లో ఆయన తరం హీరోలలో ఒక అరుదైన రికార్డు అందుకున్నారట. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.

HBD Nagarjuna: Nag owns that record.. Here is the proof..!
HBD Nagarjuna: Nag owns that record.. Here is the proof..!

ఆ తరం హీరోలలో నాగార్జున అరుదైన రికార్డ్..

నాగార్జున తెలుగు హీరోల్లో ముందు నుంచి హిందీలో ఎక్కువ చిత్రాలలో నటించిన హీరోగా నిలిచారు. తన తరం హీరోలైన బాలకృష్ణ (Balakrishna ), చిరంజీవి(Chiranjeevi), వెంకటేష్(Venkatesh )వంటి హీరోల కంటే కూడా ఈయన ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలలో నటించి రికార్డు సృష్టించారు. సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలలో నటించిన హీరోగా అక్కినేని నాగార్జున పేరు సంపాదించుకోగా.. ఆయన కంటే ముందు కమల్ హాసన్(Kamal Hassan) , రజినీకాంత్(Rajinikanth )ఎక్కువ హిందీ చిత్రాలలో నటించి పేరు దక్కించుకున్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎక్కువ హిందీ సినిమాలలో నటించిన హీరోగా నాగార్జున మాత్రమే రికార్డులోకి ఎక్కారు.

బాలీవుడ్లో అత్యధిక చిత్రాలలో నటించిన తెలుగు హీరో..

ఇకపోతే మొత్తంగా నాగార్జున బాలీవుడ్ లో నటించిన చిత్రాల విషయానికి వస్తే.. శివ.. నాగార్జున హిందీలో నటించిన మొదటి చిత్రం ఇది. తెలుగులో రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని అదే టైటిల్ తో హిందీలో దాదాపు అదే ఆర్టిస్టులతో బాలీవుడ్లో రీమేక్ చేశారు. ఈ సినిమా బాలీవుడ్ లో మంచి సక్సెస్ సాధించి, అక్కడ నాగార్జునకు మంచి పేరు అందించింది.

- Advertisement -

ఖుదా గవా.. అమితాబ్ బచ్చన్ హీరోగా , శ్రీదేవి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున రెండవ హీరోగా నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ద్రోహి.. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెలుగులో అంతం మూవీని హిందీలో ద్రోహి పేరుతో బై లింగ్వల్ మూవీగా తెరకెక్కించారు. అప్పట్లో ద్వి భాషా చిత్రంగా ఈ సినిమా రికార్డుకు ఎక్కింది. బోణీ కపూర్ నిర్మాతగా వ్యవహరించగా , మణిశర్మ మ్యూజిక్ అందించారు.

క్రిమినల్.. మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన క్రిమినల్ చిత్రం కూడా తెలుగుతోపాటు హిందీలో ఒకేసారి తెరకెక్కించారు. తెలుగులో యావరేజ్ గా నిలిచినా హిందీలో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

మిస్టర్ బేచారా.. కే .భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్రను పోషించారు.

అంగారే.. మరొకసారి మహేష్ భట్ దర్శకత్వంలో, నాగార్జున నటించగా ఇందులో అక్షయ్ కుమార్ మరో హీరోగా నటించారు.

ఈ చిత్రాలతో పాటు జక్మ్, అగ్ని వర్ష, ఎల్ వో సి, బ్రహ్మాస్త్ర తదితర చిత్రాలలో నటించి పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈరోజు నాగార్జున పుట్టినరోజు ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు