HBD Prasanth Varma: ఎన్నో అవమానాలు.. ఆఫీస్ బాయ్ గా కష్టాలు.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎదిగిన తీరు..!

HBD Prashanth Varma.. ప్రశాంత్ వర్మ.. ఎటువంటి అంచనాలు లేకుండా హనుమాన్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసి భారీ ఇమేజ్ చేసుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఈ ఒక్క సినిమాతో ఇండియా వైడ్ ఫేమస్ అయిపోయారు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమా హిందీలో కూడా సత్తా చాటుతోంది. బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన హనుమాన్ సినిమా తక్కువ బడ్జెట్ తో మంచి క్వాలిటీ వీఎఫ్ఎక్స్ ఇచ్చినందుకు ఆయనను కొనియాడుతున్నారు.. తేజ సజ్జా కి కూడా మంచి హిట్టు పడింది.

హనుమాన్ సక్సెస్ రణ్వీర్ సింగ్ తో అవకాశం..

ప్రశాంత్ వర్మ , తేజ కాంబో లో ఇది రెండవ చిత్రం. గతంలోనే వీరి కాంబినేషన్లో జాంబిరెడ్డి సినిమా రాగా.. ఇప్పుడు రెండవ సినిమా ఏకంగా పాన్ ఇండియా వరల్డ్ గా గుర్తింపు తెచ్చుకుంది..ఇకపోతే ప్రశాంత్ వర్మ ఈ పాపులారిటీతో.. ఈ సినిమా దెబ్బకి రణవీర్ సింగ్ తో సినిమా చేసే అవకాశాన్ని కూడా సొంతం చేసుకున్నారు.

ఎన్నో కష్టాలు, అవమానాలు..

HBD Prasanth Varma: Many insults.. Difficulties as an office boy.. How director Prasanth Varma grew up..!
HBD Prasanth Varma: Many insults.. Difficulties as an office boy.. How director Prasanth Varma grew up..!

ఇకపోతే ప్రశాంత్ వర్మ దర్శకుడిగా ఎదిగే క్రమంలో అనేక అవమానాలు ,ఒడిదుడుకులను కూడా ఎదుర్కొన్నారట. ఆ అనుభవాలను గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.. ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.. అసలు తాను ఎదుర్కొన్న కష్టాల గురించి ఆ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ ఏం మాట్లాడారు అనే విషయానికి వస్తే.. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ నేను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ఎక్కువగా డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్ చేశాను. వాటికి దక్కిన సర్టిఫికెట్స్ పట్టుకొని అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇస్తారని సినీ ఇండస్ట్రీ చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగాను.. కానీ వాటిని చూసి చాలా మంది ఓవర్ కాన్ఫిడెన్స్ అనేవాళ్ళు..అందుకే వాటిని తీసుకెళ్లడం కూడా మానేశాను. ఒకరు రికమెండ్ చేస్తే ఒక డైరెక్టర్ వద్ద అవకాశం ఇచ్చాడు.

- Advertisement -

అవమానించిన వారే సహాయం అడిగారు..

అయితే ఒకరోజు ఆ డైరెక్టర్ వెళ్లి మంచినీళ్లు తీసుకురా అన్నాడు.. నన్ను కాదనుకొని నేను అటు ఇటు చూసాను.. రేయ్ నిన్నేరా అన్నాడు.. కిచెన్ లో నుండి ఇక బయటకు వచ్చేసాను. ఇదే డైరెక్టర్ నా వద్దకు సహాయం కోసం వచ్చాడు.. ఆయన అడిగింది నేను చేసి పంపాను.. ఆ డైరెక్టర్ కి అప్పటి సంఘటన బహుశా గుర్తు లేదేమో.. నన్ను ఆయన మర్చిపోయాడు కూడా.. అందుకే నేను గతాన్ని తవ్వాలని అనుకోలేదు.. ఇక ఒకానొక సమయంలో ఒక స్టార్ డైరెక్టర్, నిర్మాత మాట్లాడుకుంటుండగా నేను కొద్ది దూరంలో నిల్చొని ఉన్నాను.. అప్పుడు ఆ స్టార్ డైరెక్టర్ నీకు ఇక్కడ ఏం పని రా ..అంటూ బూతులు తిట్టాడు.. ఒక దశలో మనకు సెట్ కాదు.. ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను.. చిన్నప్పటినుంచి ఇంట్లో వాళ్ళు నన్ను ఒక్క మాట అనే వాళ్ళు కాదు. ఎవరితో మాట పడిన సందర్భం కూడా నాకు లేదు.. అలాంటిది ఇక్కడ ఎదురైన అవమానాలు నన్ను మరింత బాధ పెట్టాయి. ఇక ఆ బాధలో నుంచి పుట్టుకొచ్చిందే ఈ సక్సెస్ అంటూ తాను డైరెక్టర్గా ఎదిగిన తీరు గురించి చెప్పుకొచ్చారు ప్రశాంత్ వర్మ.. ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు