HBD Prashanth Neel : ప్రశాంత్ నీల్ బర్త్ డే స్పెషల్.. కన్నడ ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ లెవెల్ కి తెచ్చిన దర్శక దిగ్గజం..

HBD Prashanth Neel : ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఈ పేరు తెలియని ఇండియన్ సినీ ప్రేక్షకులు ఉండరేమో.. కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చి కెజిఎఫ్ అనే సినిమాతో ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు. ఎంతలా అంటే పదేళ్ల వెనకున్న కన్నడ ఇండస్ట్రీ ని అప్డేట్ చేసి పదేళ్ల ముందుకు తీసుకెళ్లిపోయాడు. అతను తీసిన KGF పార్ట్ వన్, కెజిఎఫ్ పార్ట్2 సినిమాలతో ఇంటర్నేషనల్ లెవెల్ కి కన్నడ ఇండస్ట్రీ ని తీసుకొచ్చాడు. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ లోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడయ్యాడు. కన్నడతో, పాటు తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు ఆల్రెడీ ప్రభాస్ తో సలార్ చేసి, ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా సినిమా చేస్తున్నాడు. యాక్షన్ చిత్రాలకి కేరాఫ్ గా మారిన దర్శకుడు ప్రశాంత్ నీల్ (జూన్ 4) బర్త్ డే (HBD Prashanth Neel) ఈ రోజు. ఈ సందర్బంగా ఫిల్మిఫై నుండి తనకి బర్త్ డే విషెస్ అందచేస్తూ కన్నడ ఇండస్ట్రీ నుండి పాన్ ఇండియా వరకు ప్రశాంత్ నీల్ జర్నీ పై ఓ లుక్కేద్దాం.

HBD Prashanth Neel Birth Day Special

యాక్షన్ చిత్రాల కేరాఫ్ ప్రశాంత్ నీల్..

నిజం చెప్పాలంటే KGF వచ్చే వరకు ప్రశాంత్ నీల్ అంటే ఎవరో తెలీదు. కర్ణాటక లో నీలకంఠపురంలో పుట్టిన ప్రశాంత్ నీల్ చిన్నప్పుడే సినిమాలపై ఆసక్తి తో ఇండస్ట్రీ కి ఫ్యాషన్ తో వచ్చాడు. ఇక కన్నడ ఇండస్ట్రీ ని ఒకప్పుడు తన క్రియేటివీటి తో పాన్ ఇండియా రేంజ్ కి తెచ్చిన స్టార్ ఉపేంద్ర తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా రేంజ్ కి తీసుకువచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక ప్రశాంత్ నీల్ కూడా దర్శకుడిగా తన అభిమాన దర్శకుడు ఉపేంద్రని ఆదర్శంగా తీసుకునే ఫిల్మ్ ఇండస్ట్రీ కి వచ్చానని చాలా సార్లు అన్నాడు. అందుకే ప్రశాంత్ నీల్ సినిమాల్లో కథ పరంగా ఓకే జోనర్ లో ఉన్నా, వేరియషన్స్ లో కొత్తదనం కనిపిస్తుంది. ఇక “ఉగ్రం” అనే సినిమా తో తన తమ్ముడు శ్రీ మురళిని హీరోగా పెట్టి దర్శకుడైన ప్రశాంత్ నీల్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టగా, ఆ తర్వాత కెజిఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక ఫస్ట్ పార్ట్ చూసిన తరువాత చాలా మంది ఈ దర్శకుడిని ఏకంగా రాజమౌళితో పోల్చారు. అతని స్టైల్ అఫ్ మేకింగ్ చూస్తే ఎంతో కాలం నుంచి పని చేస్తున్న సీనియర్ డైరెక్టర్ అనుకున్నారు. కానీ KGF అతని రెండవ సినిమానే.

- Advertisement -

పాన్ ఇండియా స్టార్స్ తో పాన్ ఇండియా సినిమాలు..

ఇక కెజిఎఫ్ సీక్వెల్ తో పాన్ ఇండియా నుండి ఇంటర్నేషనల్ రేంజ్ కి వెళ్ళిపోయాడు. కెజిఎఫ్ సిరీస్ కోసం ఆరేళ్ళు కష్టపడిన ప్రశాంత్ మొత్తానికి కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని కూడా పెంచాడు. బాహుబలి తరువాత అసలైన పాన్ ఇండియా మూవీగా KGF2 సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఆ తర్వాత కన్నడ నుండే కాకుండా టాలీవుడ్ టు బాలీవుడ్ స్టార్స్ నుండి వరుస అవకాశాలు వచ్చాయి. కానీ రాజమౌళి లాగా పర్ఫెక్షన్ కోసం తాపత్రయపడే ప్రశాంత్ నీల్ మెల్లిగా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా ప్రభాస్ తో “సలార్” తెరకెక్కించి మరో సక్సెస్ సొంతం చేసుకోగా, దానికి పార్ట్ 2 గా శౌర్యంగ పర్వం కూడా అతి త్వరలోనే రానుంది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలే తీయనున్నాడు ప్రశాంత్ నీల్. ఇక ముందు ముందు దర్శకుడిగా మరింత సక్సెస్ సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు ప్రశాంత్ నీల్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు