HBD Priyamani: మొదటి సంపాదన ఏం చేసిందో తెలుసా..?

HBD Priyamani.. కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను తన అందంతో నటనతో మెప్పించిన ప్రముఖ బ్యూటీ ప్రియమణి 2003లో అతగాడు సినిమాతో మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైంది.. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత జగపతిబాబు నటించిన పెళ్లయిన కొత్తలో సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాదు వరుస సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది.. ముఖ్యంగా తమిళ చిత్రం పరుత్తివీరన్ సినిమాలో హీరో కార్తీ సరసన హీరోయిన్గా నటించిన ఈమె.. ఇందులో తన అద్భుతమైన నటనకు గాను ఏకంగా నేషనల్ అవార్డును సొంతం చేసుకోవడం గమనార్హం.

సినిమాలే కాదు వెబ్ సిరీస్ లు , షోలు కూడా..

HBD Priyamani: Do you know what made the first earnings..?
HBD Priyamani: Do you know what made the first earnings..?

ఇక ఆ తర్వాత తెలుగు, మలయాళం , తమిళ్, హిందీ, కన్నడ భాషా చిత్రాలలో అనేక సినిమాలు చేసిన ఈమె ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్లు అంటూ క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తోంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా పలు డాన్స్ కాంపిటీషన్లకి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇకపోతే ఈరోజు ప్రియమణి పుట్టినరోజు కావడంతో ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోని ఈమె మొదటి సంపాదన ఎంత వచ్చింది ? ఏం చేసింది? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

తొలి సంపాదన భద్రంగా దాచుకున్న ప్రియమణి..

ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న కష్టాలను చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రూ.కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రియమణి మొదటిసారి తొలి వేతనంగా రూ.500 మాత్రమే తీసుకుందట.. ప్రియమణి తొలి వేతనం మాత్రం. రూ .500 మాత్రమే అని .. అయితే ఆ ఫస్ట్ శాలరీగా తీసుకున్న 500 రూపాయలను ఇప్పటికీ ఎంతో భద్రంగా దాచుకున్నానని చెప్పింది. తన అద్భుతమైన నటనతో అభిమానుల మనసులు గెలుచుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఒక సినిమాలో మేకప్ లేకుండా నటించాలని భావిస్తున్నాను అని కూడా చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో పాగా..

ఇకపోతే బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ ద్వారా అడుగుపెట్టిన ప్రియమణి.. ఇందులో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే షారుక్ ఖాన్ తో జవాన్ సినిమాలో కూడా కనిపించిన ఈమె.. ఆర్టికల్ 370 అనే సినిమాలో కూడా కీలకపాత్ర పోషించింది. అలా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ భారీ గా పారితోషకం తీసుకుంటున్న ప్రియమణ.. తాజాగా ఒక లగ్జరీ కార్ ను కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. మెర్సిడెస్ బెంజ్ జి ఎల్ సి అనే కార్ ను సొంతం చేసుకున్న ఈమె దీని ధర సుమారుగా రూ. 90.15 లక్షల నుండి రూ .1కోటి వరకు ఉంటుంది. ఇక తన కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు కూడా ఆమె ఇన్స్టా లో షేర్ చేసింది.

ప్రియమణి వైవాహిక జీవితం..

వైవాహిక జీవిత విషయానికి వస్తే.. ముస్తఫా రాజ్ ను ప్రేమించి వివాహం చేసుకున్న ప్రియమణి.. ఇంకా తల్లిగా ప్రమోషన్ పొందలేదని చెప్పాలి.. ఇక త్వరలోనే ఆ విషయంపై కూడా క్లారిటీ ఇస్తామని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.. మరి ఏది ఏమైనా ప్రియమణికి సంబంధించిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు