HBD Rakshith Shetty : ప్రతిభ కి నిర్వచనంగా నిలుస్తున్న ‘రక్షిత్ శెట్టి’

HBD Rakshith Shetty : కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రక్షిత్ శెట్టి. ఇక రెండేళ్ల కింద “చార్లీ 777” అనే సినిమాతో పాన్ ఇండియా లెవల్లో హిట్టు కొట్టి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించాడు. ఇక తెలుగులోనూ రక్షిత్ కు ఫ్యాన్స్ ఉన్నారు. విభిన్నమైన సినిమాలతో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ కన్నడ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నాడు రక్షిత్. అలాగే ప్రతి సినిమాలోనూ కొత్తదనాన్ని చూపించడానికి ప్రయత్నిస్తాడు. అలాగే రక్షిత్ శెట్టి డైరెక్షన్‌కి కూడా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ రోజు రక్షిత్ శెట్టి (జూన్ 6)పుట్టినరోజు (HBD Rakshit Shetty) ఈ సందర్బంగా రక్షిత్ శెట్టికి బర్త్ డే విషెస్ ని అందచేస్తూ తన గురించి, తన సినిమాల గురించి ఓ లుక్కేద్దాం.

HBD Rakshith Shetty Birthday special

అల్ రౌండర్ గా ప్రయాణం..

ఇక కన్నడలో నామ్ ఎరియల్ ఒందు దిన అనే చిత్రంతో నటుడుగా ఎంట్రీ ఇచ్చిన రక్షిత్ కిరిక్ పార్టీ సినిమాతో సూపర్ హిట్ కొట్టి స్టార్ డమ్ సంపాదించాడు. ఆ తర్వాత కేవలం నటుడిగానే కాకుండా హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, కథా రచయితగా సినిమాలు తెరకెక్కించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముందుగా డైరెక్టర్ కావాలని అడుగుపెట్టి, అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమాలు చేస్తూనే హీరో అయ్యాడు. ఇక రక్షిత్ శెట్టి హీరోగా నటించిన చార్లీ777 తో గ్లోబల్ వైడ్ సక్సెస్ సాధించగా, లాస్ట్ ఇయర్ సప్త సాగరాదె ఎల్లో సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. అందులోనూ తనదైన నటనతో మెప్పించాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇక ఆ సినిమా తెలుగులో సప్త సాగరాలు దాటి పేరుతో రెండు పార్ట్ లు గా రిలీజ్ కాగా, విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇప్పుడు రక్షిత్ శెట్టి నటించిన ‘సప్త సాగరదాచే ఎల్లో ‘ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ మధ్యలో ‘రిచర్డ్ ఆంటోనీ’ సినిమా(Richard Antony Cinema) పనులపై ఫొకస్ చేశాడు. రిచర్డ్ ఆంటోనీ’ సినిమాపై రక్షిత్ శెట్టి అభిమానుల్లో ప్రత్యేక అంచనాలున్నాయి. కేజీఎఫ్, కాంతారలాంటి సినిమాలను నిర్మించినన ‘హోంబాలే ఫిల్మ్స్’ సంస్థ ఈ సినిమాపై పెట్టుబడి పెట్టనుంది. చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రక్షిత్ శెట్టి స్క్రిప్ట్‌పై చాలా శ్రద్ధ చూపుతున్నాడు. ‘రిచర్డ్ ఆంటోనీ’ స్క్రిప్ట్‌ను ఖరారు చేసేందుకు అమెరికా వెళ్లనున్నట్టు సమాచారం. మిగతా పనులన్నీ పక్కనబెట్టి ఈ సినిమా స్క్రిప్ట్‌పై వంద శాతం శ్రద్ధ పెడతానని చెప్పాడు.

- Advertisement -

విభిన్నకథలతో మెప్పిస్తున్న రక్షిత్..

ఇక మామూలుగా ఒక సినిమా సక్సెస్‌ అయిందన్న కారణంతో అదే తరహా సినిమాలను కొనసాగిస్తున్న హీరోలు చాలా మంది ఉన్నారు. కానీ రక్షిత్ శెట్టి మాత్రం ఆ కోవకు చెందడు. లవ్ స్టోరీ సినిమాలతో ఆయనకు మంచి పేరు వచ్చింది. అలాగని అదే తరహా సినిమాలు చేయలేదు. ‘ఉలిదవారు కందంటే’ సినిమాలో డిఫరెంట్‌గా కనిపించాడు. ‘వాస్తు పరాగా’, ‘రికీ’, ‘కిరిక్ పార్టీ’, ‘777 చార్లీ’ సప్త సాగరాదె ఎల్లో ఇలా అన్ని సినిమాల్లోనూ విభిన్నమైన పాత్రలను ప్రయత్నించాడు. ఇప్పుడు ‘రిచర్డ్ ఆంటోనీ’ సినిమాలో ఎలా కనిపిస్తాడోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక రక్షిత్ శెట్టి చార్లీ తర్వాత తన అన్ని సినిమాలను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నాడు. అలాగే తన సినిమాలతో, నటనతో ప్రేక్షకుల్ని మెప్పించడానికి ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉంటానని రక్షిత్ శెట్టి పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు