HBD Ramba : రంభ అసలు పేరేంటి? మార్చడం వెనుక ఇంత కథ ఉందా..?

HBD Ramba : ప్రముఖ గ్లామర్ బ్యూటీ, అందాల తార రంభ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. పేరుకే తెలుగమ్మాయి అయినా నార్త్ లో కూడా చక్రం తిప్పి తన అందచందాలతో భారీ ఇమేజ్ సొంతం చేసుకుంది రంభ. ఇక ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

HBD Ramba: What is Ramba's real name? Is there a story behind the change?
HBD Ramba: What is Ramba’s real name? Is there a story behind the change?

తన అందంతో భారీ గుర్తింపు తెచ్చుకున్న రంభ.. ఈ మధ్యకాలంలో ఈమె సినిమాలకు దూరమైన అభిమానుల సంఖ్య మాత్రం తగ్గలేదు. అప్పుడప్పుడు టీవీ షోలలో హల్చల్ చేసే రంభ.. సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత ప్రముఖ బిజినెస్ మాన్ ను వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. అటు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె. సొంత ఊరు విజయవాడ.. అక్కడే పుట్టి పెరిగిన ఈమె అసలు పేరు విజయలక్ష్మి.. అమాయకపు మొహంతో .. డైలాగ్లతో.. నటనతో.. నాట్యంతో.. అందచందాలతో వయ్యారాలు వొలకబోసిన ఈమె ఆ తర్వాత సూపర్ హిట్ సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది..

8 భాషల్లో క్రేజ్..

అటు భోజపురి లో కూడా భారీ పాపులారిటీ సంపాదించుకున్న రంభ.. అన్ని భాషలలో ఒకేసారి నటించడం వల్ల కాల్ షీట్ లు అడ్జస్ట్ చేయలేక చాలా సినిమాలను వదులుకుంది. అలా చివరికి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ 2010లో ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంద్రకుమార్ ను వివాహం చేసుకుంది. ఇక రంభ వివాహం జరిగిన తర్వాత ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కూడా జన్మించారు. దాదాపు 8 ప్రాంతీయ భాషల్లో 100కు పైగా సినిమాలలో నటించిన ఈమె ప్రధానంగా భోజ్ పురి, బెంగాలీ, హిందీ, కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలలో నటించింది.

- Advertisement -

ఆ ఒక్కటి అడక్కు సినిమాతో పేరు మార్పు..

ఇకపోతే ఈమె పేరు విజయలక్ష్మి అయినా.. తెలుగులో ఆ ఒక్కటి అడక్కు అనే చిత్రంలో రంభ పాత్ర ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇక ఆ తర్వాత ఆమె పేరును రంభ గా మార్చారు. ఇక రంభ సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా కనిపిస్తూ పలు కార్యక్రమాలకు న్యాయ నిర్ణేత గా కూడా వ్యవహరిస్తూ దూసుకుపోతోంది. అలా ఒకవైపు సినిమాలు , ఒకవైపు ఫ్యామిలీని కూడా లీడ్ చేస్తూ భారీగా బాధ్యతలను మోస్తూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.

స్టార్ హీరోలతో జతకట్టిన భామ.

కన్నడ సినీ ఇండస్ట్రీలో సర్వ సోమన్న అనే సినిమాతో కెరియర్ ఆరంభించిన ఈమె ఆ తర్వాత ఓ ప్రేమవే, భావ భామైదా, పాండురంగ విఠోబా, గండబలి కుమార రామ వంటి చిత్రాలలో నటించింది.. ఇక తెలుగులో ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ సరసన ఆ ఒక్కటి అడక్కు సినిమాలో నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోలు అందరితో జోడి కట్టిన ఈమె మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాకుండా తమిళంలో అజిత్, విజయ్, రజినీకాంత్.. హిందీలో సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్ తో తెరపంచుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు