HBD RamPothineni : అక్కడ ఐదు సెంచరీల రికార్డుతో రామ్ క్రేజ్..!

HBD RamPothineni : టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాక్లెట్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో, ఆ తర్వాత తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఎనర్జిటిక్ స్టార్ గా ఇప్పుడు ఉస్తాద్ రాపో గా ప్రేక్షకులకు చేరువయ్యాడు. స్టార్ ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి చిన్న వయసులోనే హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ పొతినేని. కెరీర్ ఆరంభంలోనే సాలిడ్ సూపర్ హిట్లను అందుకున్న ఇతడు స్టార్ స్టేటస్‌తో పాటు ఎనర్జిటిక్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇలా దాదాపు పదిహేనేళ్లుగా టాలీవుడ్‌లో తనదైన శైలి మార్కును చూపిస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ఆ మధ్య వరుస పరాజయాలతో సతమతం అయిన రామ్ ఇప్పుడు పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్నాడు. ‘దేవదాసు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ ‘రెడీ’ , ‘మస్కా’, ‘కందిరీగ’ వంటి హిట్లను తన ఖాతాలో వేసుకుని ఎనర్జిటిక్ స్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు. ఇక టాలీవుడ్ స్టార్ లలో చరణ్, తారక్, బన్నీ తర్వాత ఆ రేంజ్ లో డాన్స్ చేయగల స్టార్ గా రామ్ కి పేరుంది.

ప్లాపుల్లో ఉన్నా తరగని క్రేజ్..

అయితే రామ్ పోతినేని చేసిన సినిమాల్లో చాలా వరకూ పరాజయాలు ఉన్నాయి. కెరీర్ ఆరంభం నుండి చూస్తే ‘జగడం’ మొదలుకొని.. ‘రామరామ కృష్ణకృష్ణ’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’, ‘శివమ్’ రీసెంట్ గా ది వారియర్ సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక, ‘హైపర్’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఆవరేజ్‌గా నిలిచాయి. వీటి మధ్యలో ‘నేను శైలజ’, ‘పండగ చేస్కో’ వంటి హిట్లూ వచ్చాయి. ఇక ఆ మధ్య కెరీర్ డల్ గా ఉన్న టైం లో రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ వచ్చింది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ దుమ్ముదులిపేసి రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు దీనికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు రామ్.

HBD RamPothineni 5 Movies got 500 million views in youtube

- Advertisement -

హిందీలో ఐదు సెంచరీల సినిమాలు..

ఇక రామ్ కి తెలుగుతో పాటు హిందీలో కూడా సూపర్ క్రేజ్ ఉంది. రామ్ అక్కడ సినిమాలు చేయకపోయినా, తన సినిమాలని హిందీలో రిలీజ్ చేయకపోయినా, డబ్బింగ్ సినిమాలతో డిజిటల్ లో భారీ రికార్డులు అందుకున్నాడు. ఏకంగా ఐదు సెంచరీలు చేసిన హీరోగా రామ్ సినిమాలకు హిందీలోనూ మంచి డిమాండ్ ఉంది. అందుకే అతడు నటించిన ఐదు సినిమాలు యూట్యూబ్ లో ఏకంగా 500 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించాయి. ‘హలో గురూ ప్రేమ కోసమే’ హిందీ డబ్బింగ్‌కు 577 మిలియన్లు, ‘నేను శైలజ’కు 600 మిలియన్లు, ‘ఉన్నది ఒకటి జిందగీ’ కి రెండు చానెల్స్ లో కలిపి 507 మిలియన్లు, వారియర్ కు రెండు చానెల్స్ లో 538 మిలియన్లు, ‘ఇసార్ట్ శంకర్’కు కూడా మూడు ఛానెల్స్ లో కలిపి 595 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇవే కాక హైపర్, పండగ చేస్కో సినిమాలకు 200 మిలియన్ల వ్యూస్ దక్కాయి. ఇన్ని సినిమాల రికార్డ్ టాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా లేవు. ఇక రామ్ (HBD RamPothineni) ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ తో ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అవుతున్నాడు. నేడు రామ్ (మే 15) పుట్టినరోజు కాబట్టి, రామ్ కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగాలని తన “ఫిల్మీఫై” తరపున జన్మదిన శుభాకాంక్షలు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు