HBD Sreeleela: యువత కలల రాకుమారి.. బర్తడే స్పెషల్ మీకోసం..!

HBD Sreeleela.. ప్రముఖ బ్యూటీ శ్రీ లీల.. డాక్టర్ కావలసిన ఈమె నటన మీద ఆసక్తితో యాక్టర్ అయ్యింది.. ఒకవైపు డాక్టర్ చదువును కొనసాగిస్తూనే నటనలో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ దూసుకుపోతోంది.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈమె హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందD సినిమాతో కెరీర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత రవితేజ దర్శకత్వంలో వచ్చిన ధమాకా సినిమాతో ఓవర్ నైట్ లోనే పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఒకే ఏడాది తొమ్మిది సినిమాలకు సంతకం చేసి రికార్డు సృష్టించిన ఈ ముద్దుగుమ్మ.. చేసిన అన్ని సినిమాలలో భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాలు మినహా అన్ని కూడా ఫ్లాప్ గా నిలిచాయి. ఇక ఈమె నటించిన సినిమాలు డిజాస్టర్ అయినా సరే యువత కలల రాకుమారి అనడంలో సందేహం లేదు.. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో, అందంతో, నటనతో అందరినీ మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. ఇకపోతే ఈరోజు శ్రీ లీల బర్తడే.. ఈమె గురించి మనకు తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తాత కల నెరవేర్చడమే లక్ష్యం..

HBD Sreeleela: Princess of youth's dreams.. Birthday special for you..!
HBD Sreeleela: Princess of youth’s dreams.. Birthday special for you..!

నేను ఎల్కేజీ లో ఉన్నప్పుడు.. ఎవరైనా పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే డాక్టర్ అవుతానని చెప్పేదాన్ని.. నన్ను వైద్యురాలుగా చూడాలనేది మా అమ్మమ్మ , తాతయ్యాల కల.. సినిమా అవకాశాలు వచ్చినప్పుడు నా చదువు పాడవుతుందేమోనని వాళ్ళు భయపడ్డారు.. నేను కచ్చితంగా డాక్టర్ అయి తీరుతానని తాతయ్యకు మాట ఇచ్చి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను.. ఎక్కడికి వెళ్లినా నా వెంట కచ్చితంగా పుస్తకాలు ఉండాల్సిందే.. పరీక్షలు దగ్గర పడితే పగలంతా షూటింగ్లో పాల్గొని.. రాత్రంతా పుస్తకాలు తిరిగేస్తూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది శ్రీ లీలా.

తొలి సినిమా అవకాశం అలా..

నాకు ఇద్దరు అన్నయ్యలు..మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ భువన్ తో.. అమ్మ ప్రతి ఏడాది మా ముగ్గురికి ఫోటో షూట్ చేయిస్తూ ఉండేది. ఆయన మా ఫోటో ని ఫేస్ బుక్ లో షేర్ చేస్తే.. ఓ కన్నడ డైరెక్టర్ కిస్ సినిమా కోసం నన్ను సంప్రదించారు.. అలా సినిమాల్లోకి అడుగుపెట్టా.. నిజానికి అప్పుడు నేను కేవలం తొమ్మిదవ తరగతి మాత్రమే చదువుతున్నాను. నా జుట్టు ఆ సమయంలో చాలా పొడుగ్గా.. మోకాలు వరకు ఉండేది.. కానీ సినిమా కోసం మొత్తం కత్తిరించుకోవాల్సి వచ్చింది.. ఆ సినిమాకి బెస్ట్ ఫిమేల్ డెబ్యూగా నాకు సైమా అవార్డు కూడా లభించింది. అసలు సినిమాల్లోకి వస్తానని నేను అనుకోనే లేదు.. అలా ఇండస్ట్రీలోకి వచ్చేసాను అంటూ చెప్పుకొచ్చింది శ్రీ లీలా.

- Advertisement -

వర్కౌట్స్ చేయడం అసలు ఇష్టం ఉండదు..

వర్కౌట్స్ చేయడం అసలు ఇష్టం ఉండదు.. యోగా మాత్రమే చేస్తాను.. అది నాలో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది.. రెగ్యులర్గా యోగా చేయడం వల్ల శరీరం ఫిట్గా ఉండడమే కాదు ఆలోచన శక్తి కూడా మెరుగుపడుతుంది.. దాంతో రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.. స్విమ్మింగ్, డాన్స్ కూడా నా దినచర్యలో భాగమే.. నేను ఒక క్లాసికల్ డాన్సర్ ని కూడా.. అందుకే నా హావభావాలు ఇట్టే నా ముఖంలో తెలిసిపోతూ ఉంటాయి… పైగా నాకు చాలా కోపం ఎక్కువ.. నాలో ఒక అపరిచితుడు కూడా ఉన్నాడు.. నా కోపానికి ఎక్కువసార్లు మా అమ్మ బలయ్యింది.. కోపం చల్లారాక అనవసరంగా తిట్టానని ఏడుస్తూ ఉంటానని పలు విషయాలు చెప్పుకొచ్చింది శ్రీలీల.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు