HBD Suriya: మొదటి సంపాదన ఎంత? ప్రస్తుత ఆస్తులు విలువ తెలిస్తే షాక్..!

HBD Suriya.. 2019 ప్రముఖ కోలీవుడ్ హీరో సూర్య పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుపుతున్నారు.ముఖ్యంగా సూర్య చిన్ననాటి ఫోటోలను, ఎవరు చూడని వీడియోలను షేర్ చేస్తున్నారు. అలాగే తమ ఫేవరెట్ హీరో గురించి కూడా తెలుసుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రియల్ లైఫ్ లో సూర్య ఎలా ఉంటారు..? ఆయన ఎలా కెరియర్ మొదలుపెట్టారు? మొదటి సంపాదన ఎంత? ఇప్పుడు ఆస్తులు విలువ ఎంత ?అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

HBD Suriya: What is the first earnings? Shock if you know the value of the current assets..!
HBD Suriya: What is the first earnings? Shock if you know the value of the current assets..!

రియల్ లైఫ్ లో కూడా హీరోనే..

సూర్య రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా సూపర్ హీరోనే.. తన సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంటూనే అటు సామాజిక సేవ చేయడంలో కూడా ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా కష్టాల్లో ఉన్న అభిమానులకు ఆయన సహాయం చేయడంలో ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. నటుడుగా తనను తాను నిరూపించుకున్న సూర్య, ఇప్పటివరకు కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలలోనే నటించి క్రిటిక్స్ ప్రశంసలు కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోలలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సూర్య, అత్యంత ధనవంతులైన నటులలో ఒకరిగా నిలిచారు.

రోలెక్స్ పాత్రతో ఊహించని గుర్తింపు..

కోలీవుడ్ సీనియర్ నటులు శివకుమార్ పెద్ద కుమారుడే సూర్య. ఈయన సోదరుడు కార్తీ కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. 1997లో విడుదలైన నెరుక్కు నాయర్ అనే సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈయన గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఖాకా ఖాకా సినిమాతో మంచి బ్రేక్ అందుకున్నారు. ఎక్కువగా కంటెంట్ ప్రాధాన్యత మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలు ఎంచుకుంటూ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన, ఇటీవల విడుదలైన విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్ర చేసి ఆకట్టుకున్నారు.

- Advertisement -

హీరో సూర్య ఆస్తుల విలువ..

ప్రస్తుతం ఈయన ఆస్తుల విలువ విషయానికి వస్తే .. ముంబైలో రూ.70 కోట్ల విలువ చేసే ఇంటినీ ఇటీవలే కొనుగోలు చేశారు. ప్రస్తుతం సూర్య ఆస్తులు రూ.350 కోట్ల పై మాటే . చెన్నైలో ఇల్లు కూడా ఉంది . అంతేకాదు ఎన్నో లగ్జరీ కార్ లను సొంతం చేసుకున్న సూర్య , సొంత బ్యానర్ కూడా ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్లో చాలా సినిమాలు విడుదలవుతూ మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సూర్య మొదటి సంపాదన ఎంత? ఎలా సంపాదించారు అనే విషయాలు హాట్ టాపిక్ గా మారాయి.

సూర్య మొదటి సంపాదన..

గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య తన మొదటి సంపాదన గురించి వెల్లడించారు.. తాను 18 గంటలు పని చేసి.. రూ.1000 రూపాయల కంటే తక్కువ జీతం తీసుకున్నానని తెలిపారు. సినిమాల్లోకి రాకముందు దుస్తులు తయారు చేసి ఎగుమతి చేసే దుకాణంలో పనిచేశాను రోజుకు 18 గంటలు పనిచేస్తే 736 రూపాయలు జీతం ఇచ్చేవారు ఇదే నా తొలి జీతం అంటూ తెలిపారు.

ప్రస్తుత రెమ్యూనరేషన్..

ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు సూర్య.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు